Home > Featured > పని చేయాలంటే బద్ధకమా.. అయితే మీకు సరిపోయే జాబ్ ఇదే..

పని చేయాలంటే బద్ధకమా.. అయితే మీకు సరిపోయే జాబ్ ఇదే..

పనీపాటా లేకుండా తిని, పడుకుంటే డబ్బులొస్తాయా? అంటారు కానీ… నిజంగానే ఏం చేయకుండా ఎంత ఎక్కువ సేపు పడుకుంటే అన్ని ఎక్కువ డబ్బులొచ్చే పోటీ ఒకటి ఉంది. అదే ‘లైయింగ్‌డౌన్‌ కాంపిటీషన్‌’. యూరప్‌ దేశమైన మాంటెనెగ్రోలోని ఓ నగరమైన నిక్సిక్‌లో ఈ వింత పోటీ జరుగుతుంది. ఈ పోటీలో 60 గంటలపాటు పడుకొని, బహుమతి గెలుచుకున్నాడో వ్యక్తి.

మాంటెనెగ్రె దేశంలో నిక్సిక్ నగరం ఉంది. ఈ నగరానికి వెలుపల కొన్ని కిలోమీటర్ల దూరంలో బ్రెజ్నా అనే గ్రామం ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ పోటీ ఉంటుంది. ఈ పోటీల్లో పాల్గొనేవారు నిద్రపోవాల్సి ఉంటుంది. ఎక్కువసేపు పడుకున్న వ్యక్తికి బహుమతి లభిస్తుంది. ఈ ఏడాది జరిగిన పోటీల్లో జర్కో పెజనోవిక్ అనే వ్యక్తి విజయం సాధించాడు. అతను మొత్తం 60 గంటలపాటు ఏకదాటిగా నిద్రపోయి దాదాపు 27 వేల రూపాయలను గెలుచుకున్నాడు.

ఈ పోటీలు పైకి కేవలం నిద్ర పోవటమే కదా అనిపిస్తుంది.. కానీ ఎక్కువ సేపు నిద్రపోవటం అంటే చాలా కష్టంతో కూడుకున్న పనే. 60గంటలు నిద్రపోయినప్పటికీ పెజనోవిక్ గత రికార్డులను బద్దలు కొట్టలేక పోయాడు. 2021 సంవత్సరంలో ఈ పోటీలో ఒక మహిళ గెలిచింది. ఆమె 117 గంటల పాటు అంటే నాలుగు రోజుల 21 గంటల పాటు నిరంతరం పడుకుంది. ఈ పోటీలో మొత్తం తొమ్మిది మంది పాల్గొన్నారు. అందులో మొదటి రోజే 7 మంది ఔట్ అయ్యారు. ఇందులో పాల్గొన్న జర్కో పెజనోవిక్ 12వ ఛాంపియన్ గా నిలిచాడు. అతగాడు మాట్లాడుతూ….“ఏ పని చేయకుండా పడుకొని డబ్బులు సంపాదించడం ఈజీ అనుకున్నాను.కానీ అది అనుకున్నంత సులువు కాదు.మనల్ని ఆ సమయంలో చూడటానికి కుటుంబసభ్యు­లెవరైనా వచ్చినా కూడా లేవకుండా ఉండగలగడం అత్యంత కష్టమైన విషయం!” అని చెప్పుకొచ్చాడు.

Updated : 28 Aug 2022 4:11 AM GMT
Tags:    
Next Story
Share it
Top