వైరల్ పిక్స్ : ప్రభుత్వ నిర్ణయంతో భయంకరంగా మారిన సాతాను భక్తుడు - MicTv.in - Telugu News
mictv telugu

వైరల్ పిక్స్ : ప్రభుత్వ నిర్ణయంతో భయంకరంగా మారిన సాతాను భక్తుడు

April 15, 2022

last

తనను తాను సైతాను భక్తుడిగా అభివర్ణించుకునే బ్రెజిల్‌కు చెందిన మిచెల్ ఫారో ఫ్రాడో అనే వ్యక్తి అందుకోసం తన రూపాన్ని భయంకరంగా మార్చుకున్నాడు. సైతాను మెప్పుకోసం 60కి పైగా సర్జరీలు చేయించుకొని నరరూప రాక్షసుడిలా తయారయ్యాడు. నోట్లోని పళ్లను పదునుగా చెక్కించుకొని, నాలుకను రెండుగా కత్తిరించుకున్నాడు. తలపై రెండు కొమ్ములను ఇంప్లాంట్ చేయించుకొని 85 శాతం పైగా శరీరంపై పచ్చబొట్లు పొడిపించుకున్నాడు. దీంతోపాటు ముక్కును, చేతుల్లోని రెండు వేళ్లను తొలగించుకున్నాడు. మిచెల్ ఇంతటితో ఆగలేదు. కరోనా కారణంగా ప్రభుత్వాలు మాస్క్ తప్పనిసరిగా వేసుకోవాలని ఖచ్చితమైన నిబంధన విధించడంతో ఇంతకాలం ఆగి, ప్రభుత్వం నిబంధనలను సడలించడంతో మరో భయంకర పనికి పూనుకున్నాడు. తన రెండు చెవులను తొలగించుకొని మరింత జుగుప్సాకరంగా తయారయ్యాడు. అనంతరం ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పిల్లల్నే కాదు పెద్దలు కూడా భయపడేలా ఉన్న మిచెల్ శరీరాన్ని చూసి నెటిజన్లు ఒక్క క్షణం ఆశ్చర్యపోతున్నారు.