man risked his life in front of train
mictv telugu

చెప్పుకోసం ప్రాణాలు మీదకి..సెకెన్‌లో బయటపడ్డాడు..(వీడియో)

November 17, 2022

కాస్త నిర్లక్ష్యం నిండు ప్రాణాలను తీసే అవకాశం ఉంది. అజాగ్రత్తతో క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది. కొందరు చిన్న తప్పిదాలు, మరికొందరు పిచ్చి చేష్టలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా రైలు ప్రమాదాలు చూస్తుంటున్నాం. కదులుతున్న రైలు నుంచి దూకేయడం, ఫోన్ మాట్లాడుతూ పట్టాలు దాటి ప్రమాదాలకు గురవ్వడం వంటి సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. తాజాగా ఓ వ్యక్తి అజాగ్రత్తగా వ్యవహరించి కాస్తలో చావు నుంచి బయటపడ్డాడు.

పట్టాలపై నుంచి ఆ వ్యక్తి ప్లాట్‌ఫామ్ దాటాడు. అలా వచ్చే క్రమంలో పట్టాలపై చెప్పు ఉండిపోయింది. వెనక్కి వచ్చి చెప్పులేసుకుని మళ్లీ..దాటబోయాడు. అంతలో ట్రైన్ వచ్చేసింది. కేవలం సెకన్ అంటే సెకన్ వ్యవధిలో ప్లాట్‌ఫామ్‌పై ఎక్కేసాడు. అది కూడా ఓకానిస్టేబుల్ సాయం చేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోను చూసిన వారంతా అతనిని తిట్టిపారేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవరించి ప్రాణాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు.