బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ కారు డ్రైవర్ కర్కషంగా ప్రవర్తించాడు. రోడ్డుపై నిద్రిస్తున్న శునకాన్ని ఢీ కొట్టాడు. సెకెన్ల సమయం వేచి ఉండలేక దానిపై నుంచి కారును పోనిచ్చాడు .ఈ ఘటనలో ఆ మూగజీవి ప్రాణాలు కోల్పోయింది.
#Graphics :#HitAndRunCase : A Swift Car drove over a #Dog & driver didn't bother to stop the car..Dog died in this accident.Incident happened at Muthurayanagara ,#Bengaluru on Saturday. FIR registered at Jnanabharathi Police station,no arrests yet..@Anti_CrueltyCel @DCPWestBCP pic.twitter.com/mdWnVBoX80
— Yasir Mushtaq (@path2shah) January 9, 2023
పూర్తి వివరాల్లోకి వెలితే.. రోడ్డుపై ఓ శునకం పడుకొని ఉంది. ఇంతలో మలుపు తిప్పి ఓ కారు ఆ రోడ్డులోకి ఎంటర్ అయ్యింది. ఆ కారు సౌండ్‌కి ఆ కుక్క లేచింది. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమవ్వగా కారు డ్రైవర్ అతవేగంతో వచ్చి ఢీ కొట్టాడు. ఏకంగా కారును శునకం మీద నుంచే నడిపాడు. కారు చక్రాల కింద శునకం వెనుక భాగం పూర్తిగా నలిగిపోయింది. బాధతో విలవిలాడింది. అక్కడున్నవారు గమనించి దానిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఆ డ్రైవర్ ఉద్దేశపూర్వకంగానే అలా చేశాడని ఆ వీడియోల్లో స్పష్టమవుతోంది. దీంతో జంతు ప్రేమికుల నుంచి తీవ్ర ఆగ్రహం చేస్తున్నారు. కారు రిజిస్ట్రేషన్ నంబర్ KA 05 MP 5836గా గుర్తించి.. డ్రైవర్ కోసం కర్ణాటక పోలీసులు గాలింపు చేపట్టారు. జనవరి 7వ తేదీన ఈ ఘటన చోసుకుంది.