డాక్టర్లు, పోలీసులకు కొబ్బరికాయ కొట్టి దండం పెడుతున్న యువకుడు - MicTv.in - Telugu News
mictv telugu

డాక్టర్లు, పోలీసులకు కొబ్బరికాయ కొట్టి దండం పెడుతున్న యువకుడు

March 26, 2020

Man Says Thanks to Doctors And Police.

కరోనాపై పోరాటంలో వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు వీరే ఇప్పుడు సైనికుల్లా పని చేస్తున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడే దేవుళ్లుగా వీరిని చాలా మంది భావిస్తున్నారు. తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఈ మహమ్మారిని తరిమిసేందుకు అహర్నిషలు కృషి చేస్తున్నారు. ఇంత సేవ చేస్తున్న వారిని అభినందిస్తూ చప్పట్లతో ప్రశంసలు తెలపాలని ఈనెల 22న ప్రధాని మోదీ పిలుపుతో దేశవ్యాప్తంగా అంతా పాల్గొన్నారు. తాజాగా కడప జిల్లాలో ఓ వ్యక్తి మాత్రం డాక్టర్లకు, పోలీసులకు వెరైటీగా కృతజ్జతలు చెబుతున్నాడు. 

కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలిచిన వారే దేవుళ్లుగా భావించి వారికి కొబ్బరి కాయలు కొట్టి మరీ అభిమానం చాటుతున్నాడు. కొండాపురం మండలంలోని ఓబన్నపేటకు చెందిన సద్దాం ఇలా తన మొక్కులు చెల్లిస్తున్నాడు. ఉగాది పండగ సందర్భంగా కొండాపురంలోని ప్రభుత్వ ఆస్పత్రి, పోలీస్‌స్టేషన్‌ దగ్గర కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకున్నాడు. ప్రజలకు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా కాపాడుతున్నావారికి  ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరాడు. ఇతడు చేసిన పని ఇప్పుడు వైరల్‌గా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో నిజంగానే వైద్యులు దేవుళ్ళుగా మారిపోయారని పలువురు అభిప్రాయపడుతున్నారు.