Home > Featured > బాలుడిపై అత్యాచారం.. నిప్పు పెట్టి పరార్.. 

బాలుడిపై అత్యాచారం.. నిప్పు పెట్టి పరార్.. 

Man Sets Commit With Minor Boy

మైనర్ బాలుడిపై ఓ కామ పిశాచి రెచ్చిపోయాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అస‌హ‌జ‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా బతికి ఉండగానే నిప్పంటించి పారిపోయాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని రక్షించి ఆస్పత్రిలో చేర్పించారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్ర‌యాగాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు అతన్ని నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.

స‌ల్మాన్ అనే యువ‌‌కుడు స్థానికంగా నివాసం ఉంటున్న ఓ బాలుడిని ఆడుకుందామ‌ని పిలిచాడు. పదేళ్ల బాలుడు అతని వెంట వెళ్లగా ఎవరూ లేని ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. భయంతో ఆ బాలుడు కేకలు వేయడంతో గట్టిగా గొంతు నొక్కాడు. దీంతో ఆ బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. చనిపోయాడని భావించి పొదల్లోకి తీసుకెళ్లి నిప్పంటించాడు. కాలిపోతున్న సమయంలో మెలుకువరావడతో గట్టిగా అరిచాడు. ఆ అరుపులు విన్న స్థానికులు వచ్చి రక్షించారు. ఆ కామాందున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Updated : 1 May 2020 4:09 AM GMT
Tags:    
Next Story
Share it
Top