సోషల్ మీడియా పుణ్యమా అని పబ్లిక్‌లో పిచ్చి వేశాలు ఎక్కువ అయిపోయాయి. లైక్స్, వ్యూస్ కోసం తుంటరి వేషాలు వేస్తున్నారు కొందరు యూట్యూబర్స్. కొందరు ప్రాంక్ పేరిట న్యూసెన్స్ చేస్తే..మరికొందరు ప్రజల బలహీనతలను పసిగట్టి డబ్బులు సంపాదించుకుంటున్నారు. యూబ్యూబ్ వీడియోలు, ఇన్ స్టా రీల్స్‌లో ట్రెండింగ్ అయ్యేందుకు నడిరోడ్డుపై నాటకాలు ఆడుతున్నారు. తాజాగా బెంగళూరు ఓ వ్యక్తి చేసిన పని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
#Bengaluru में हो गई नोटों की बरसात, एक शख्स ने मार्केट फ्लाई ओवर से 10-10 रुपए के नोट उछाल दिए,जिससे कानून व्यवस्था की हालत बिगड़ गई, पुलिस को लगता है कि आरोपी का मानसिक संतुलन ठीक नहीं है, मामले की जांच की जा रही है। @indiatvnews pic.twitter.com/Hxw5NCa5Wk
— T Raghavan (@NewsRaghav) January 24, 2023
బెంగళూరులోని కేఆర్ మార్కెట్ ఫ్లైఓవర్ వద్ద నల్లసూట్, ఓ బ్యాగ్ వేసుకొని పెద్ద బిజినెస్ మ్యాన్ ఫోజుతో ఎంట్రీ ఇచ్చాడు. రాగానే బ్యాగులో చేయిపెట్టి పది రూపాయల నోట్లను ఫ్లై ఓవర్ పై నుంచి కిందకు విసిరేశాడు.ఫ్లై ఓవర్ రెండు వైపులా డబ్బులు విసురుతూ నానా హడావుడి చేశాడు. దీంతో పై నుంచి కిందకు పడుతున్న నగదును తీసుకునేందుకు జనం పోటీ పడడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి రావడంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. అతడు పది రూపాయల నోట్ల రూపంలో రూ.3,000 వరకూ అతను విసిరాడు. వైరల్ వీడియో షూట్ చేయడం కోసమే ఈ పనిచేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దృష్టిసారించారు. పూర్తి సమాచారం సేకరించి చర్యలు తీసుకుంటామని వెస్ట్ డీసీపీ లక్ష్మణ్ నింబారగి తెలిపారు.