కారులో బెడ్డు.. బార్లా పడుకుని ప్రయాణం.. - MicTv.in - Telugu News
mictv telugu

కారులో బెడ్డు.. బార్లా పడుకుని ప్రయాణం..

October 25, 2020

dvgdbg

కారులో లాంగ్ డ్రైవ్ వెళ్లినప్పుడు నిద్ర వస్తే కూర్చునే పడుకోవాల్సి వస్తుంది. అక్కడక్కడా బ్రేక్ చేస్తూ బడలిక తీర్చుకుని తిరిగి ప్రయాణం కొనసాగిస్తుంటారు. ఇక రైళ్లలో వెళ్లేవారు చక్కగా పై బెర్తులో కాళ్లు బార్లా చాచి పడుకుంటారు. కానీ కారులో అలాంటి వెసలుబాటు ఉండదు. అయితే ఇలాంటి ఇబ్బందిని కనుగొన్న ఓ వ్యక్తి తన కారులో పడుకోవడానికి వీలుగా బెడ్డును ఏర్పరిచాడు. బెడ్డుతో పాటు చిన్నపాటి ఫ్రిజ్జు, ఇతరాత్రా వస్తువులు కూడా ఉంచుకోవడానికి వీలుగా రూపొందించాడు. 

నాథనిల్ వైస్ అనే వ్యక్తి కారు లోపలి భాగాన్ని ప్రయాణాలకు అనుగుణంగా మార్చుకున్నాడు. వెనుక డిక్కీ డోర్ తెరవగానే బెడ్ కనిపిస్తుంది. బెడ్‌ను పక్కకు జరిపితే కావాల్సిన వస్తువులు, చిన్న ఫ్రిజ్, కిచెన్ అన్ని దర్శనం ఇస్తాయి. అలా అతను అన్నింటిని తన కారులోనే ఏర్పాటు చేసుకున్నాడు. 2018 నుంచి రీ మోడల్ కారులో లాంగ్ డ్రైవ్ చేస్తున్నాడు నాథనిల్ వైస్. ఇందుకు సంబంధించిన వీడియోను అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా తెగ చక్కర్లు కొడుతోంది. చాలా మంది ఆ కారును లైక్ చేస్తున్నారు.