Man skillfully flings baskets of tomatoes into truck; internet impressed
mictv telugu

టామాటాల లోడింగ్.. ఒకసారి చూశారంటే తప్పకుండా మళ్లీ చూస్తారు

October 21, 2022

నెల రోజుల పనికి జీతమిస్తారంటే ఏ ఉద్యోగి అయినా పని చేస్తాడు. కానీ చేసే పనిలో ఆనందాన్ని వెతికే ఉద్యోగి పని చేస్తే ఎలా ఉంటుందో తెలుసా?. రోజువారీ పని అయినా ఎలాంటి విసుగు లేకుండా పనిమంతుడికి అందులో టెక్నిక్స్‌ని, ట్రిక్స్‌ని త్వరగా అలవాటు చేసుకుంటాడు. ఈ క్రమంలో తన పనిని వేగంగా, వినూత్నంగా, సనాయాసంగా చేస్తూ ప్రొఫెషనల్ అనిపించుకుంటాడు. ఈ వీడియోలో చూస్తున్నది అలాంటి వ్యక్తినే. ఆ వ్యక్తి చేసే పని చూస్తుంటే మళ్లీ మళ్లీ చూడాలని అనిపించక మానదు. కావాలంటే మీరూ ఒకసారి ట్రై చేయండి.

ఈ వీడియోను ప్రతీక్ జైన్ అనే వ్యక్తి ట్విట్టర్ పోస్ట్ చేయగా, పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. అద్భుతమైన నైపుణ్యంతో టమాటాలను లోడ్ చేస్తున్నాడని, ఇందులో ఏమైనా ఇంజనీరింగ్ ఉందంటారా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. పొలంలో కూలీలు టమాటాలు తెంపి వాటిని వెదురు బుట్టల్లో నింపి పెడుతున్నారు. ఒక్కో బుట్టను రెండు చేతులతో బలంగా పైకి లేపి ఆ వ్యక్తి పైకి విసురుతున్నాడు. దీంతో టమాటాలు ట్రక్కులో పడి, ఖాళీ బుట్ట వ్యక్తి ముందు భాగంలో పడిపోతోంది.. అక్టోబర్ 18న ఈ వీడియోను పోస్ట్ చేయగా, ఇప్పటికి కోటి సార్లకు పైగా నెటిజన్లు వీక్షించారు.