Man slaps and kicks donkey repeatedly in viral video. Then, instant karma happened
mictv telugu

గాడిద ఇచ్చి పడేసింది… యువకుడి తిక్క కుదిర్చింది

July 30, 2022

ఎవరు చేసిన పాప, పుణ్య కర్మ ఫలితాలను వారు తప్పక అనుభవించాల్సిందేనని ఓ నానుడి. చేసే పనిని బట్టి.. దాని వల్ల కలిగే ఫలితం కూడా కర్మను అనుసరించి వస్తుంది. ఓ యువకుడి విషయంలో ఈ కర్మ సిద్ధాంతం త్వరగా అప్లై అయింది. అకారణంగా ఓ మూగజీవిని హింసించినందుకు ఫలితాన్ని అనుభవించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ యువకుడు పొలం మీద కట్టేసి ఉన్న గాడిదని ఇష్టం వచ్చినట్లు కొడుతున్నాడు. ముఖం మీద చేతితో గట్టిగా చాలా సార్లు కొట్టాడు. కాలితో తన్నాడు. ఆ తర్వాత… దానిని గట్టిగా లాక్కురావడానికి ప్రయత్నించాడు. దానిని అంత హింసించి.. తర్వాత దాని మీద ఎక్కి స్వారీ చేయాలని అనుకున్నాడు.

అంత కొట్టిన తర్వాత ఆ గాడిద ఎందుకు ఊరుకుంటుంది. తన సహనాన్ని కోల్పోయింది. ఆ యువకుడు చేసిన పనికి తగిన బుద్ధి చెప్పింది. ఎగిరెగిరి తన్నుతున్న ఆ యువకుడి కాలుని తన నోటితో గట్టిగా పట్టుకొని కొరికి పారేసింది. అతను ఎంత గింజుకున్నా వదిలిపెట్టలేదు.. కాగా.. ఆ వీడియోని శక్తి కపూర్ షేర్ చేయగా.. వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తిక్క కుదిర్చింది.. గాడిదే కదా అని గాడితప్పితే.. అలాగే ఉంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

https://www.indiatoday.in/trending-news/story/man-slaps-and-kicks-donkey-repeatedly-in-viral-video-then-instant-karma-happened-1981526-2022-07-29