సుప్రీంకోర్టు వద్ద వ్యక్తి హల్‌చల్.. చేయి కోసుకుని - MicTv.in - Telugu News
mictv telugu

సుప్రీంకోర్టు వద్ద వ్యక్తి హల్‌చల్.. చేయి కోసుకుని

April 12, 2019

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎదుట ఓ వ్యక్తి చేయి కోసుకుని కలకలం సృష్టించాడు. శుక్రవారం ఉదయం కోర్టు కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్నాయి. ఇంతలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి లోపలికి వెళ్లాడు. అందరూ చూస్తుండగానే జేబులోంచి కత్తి తీసి ఎడమచేతిపై కోసుకున్నాడు.

Man slits arm in Supreme Court

దీంతో వెంటనే అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే సిబ్బంది రక్తస్రావం అవుతున్న అతడి చేతికి రుమాలు కట్టి అక్కడి నుంచి తరలించారు. అయితే, ఈ చర్యకు పాల్పడిన వ్యక్తి వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.