ఏం చేశాడో చూడండి.. నోరు తెరవడం ఖాయం (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

ఏం చేశాడో చూడండి.. నోరు తెరవడం ఖాయం (వీడియో)

December 3, 2019

ఈ వీడియోను చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు. ఆశ్చర్యం, అద్భుతం, వహ్వా, వారెవ్వా అని ఇంకా ఏదేదో అనేస్తారు. రూబిక్ క్యూబ్‌ పజిల్‌ ఎలాంటిదో తెలుసు కదా.. అందులోని రంగులను ఒకేచోటకు తీసుకురావడానికి చాలా రిస్క్ అనిపిస్తుంది. వాటిని కలపలేక చాలామంది చేతులు ఎత్తేస్తుంటారు. కొందరేమో కొన్ని ట్రిక్కులు ఉపయోగించి వాటిని పూర్తిచేస్తారు. 15 నిమిషాలు లేదా అంతకన్నా ఎక్కువ సమయం తీసుకుంటారు. ఇటీవల చెన్నైకు చెందిన ఓ చిన్నారి కళ్లకు గంతలు కట్టుకుని 2.7 నిమిషాల్లో రూబిక్ క్యూబ్‌ను పూర్తి చేసింది. 

ఆమె పేరును ప్రస్తుతం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసం పరిశీలిస్తున్నారు. ఇదిలావుండగా ఓ వ్యక్తి రూబిక్ క్యూబ్‌ను కలపడంలో చాలా వినూత్నంగా ప్రయత్నించాడు. మూడు రూబిక్ క్యూబ్‌లను చేతుల్లో పట్టుకుని గాలిలో ఎగరేస్తూ పట్టుకుంటున్నాడు. ఇలా పట్టుకోవడం మనం చాలా చూశాం. కానీ అతను ఎగరేస్తున్నవి రూబిక్ క్యూబ్‌లు. అలా ఎగరేస్తూ అతను వాటిని ఒకే రంగులోకి మార్చాడు. అలా ఎలా? అని ఆశ్చర్యపోతున్నారు కదూ. అదే అతని ప్రత్యేకత. అతనివద్ద ఉన్న ప్రత్యేక విద్య. ఇప్పుడు మీరు మళ్లీ ఈ వీడియోను రివైండ్ చేసి చూస్తారు. ఎలా చేశాడబ్బా అని మళ్లీ మళ్లీ ప్రశ్నించుకుంటారు. ఈ వీడియోను థియో అనే వ్యక్తి ట్విటర్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. దీనిని ఇప్పటివరకు 7.7 మిలియన్ల మంది వీక్షించారు. మీరూ చూడండి.. ఆశ్చర్యపోరంటే ఒట్టు.