ప్రాణం తీసిన హెడ్ ఫోన్స్.. రైలు కిందపడి వ్యక్తి మృతి  - MicTv.in - Telugu News
mictv telugu

ప్రాణం తీసిన హెడ్ ఫోన్స్.. రైలు కిందపడి వ్యక్తి మృతి 

September 28, 2020

 

n vgbmnn

చిన్నపాటి అజాగ్రత్త నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. చెవిలో హెడ్ ఫోన్ పెట్టుకుని నిర్లక్ష్యంగా రైల్వే ట్రాక్‌పైకి వెళ్లి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.  రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం కడియాల కుంట తండా సమీపంలో ఇది జరిగింది. రైలు వచ్చి పై నుంచి దూసుకెళ్లడంతో అతడు చనిపోయాడు. మృతుడు మూడవత్ రాంసింగ్‌గా అధికారులు గుర్తించారు. ఈ సంఘటన అతని కుటుంబంలో విషాదం నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. 

రాయికల్ బురుజు గడ్డ తండాకు చెందిన మూడవత్ రాంసింగ్  సోమవారం ఉదయం డబల్ లైన్ రైల్వే ట్రాక్ పైకి వచ్చాడు. చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఫోన్ మాట్లాడుతూ అక్కడే నిలుచున్నాడు.లాక్‌డౌన్ కావడంతో ఈ సమయంలో రైళ్లు ఏమి రావనే ధీమాతో పట్టించుకోకుండా ఉన్నాడు. అంతలోనే ఓ రైలు వేగంగా వచ్చింది. శబ్ధం చేసినా చెవిలో హెడ్ ఫోన్ కారణంగా అతడు పట్టించుకోలేదు. అతనిపై నుంచి రైలు దూసుకెళ్లడంతో అక్కడే మరణించాడు.