వంట వండుతున్నప్పుడు పొయ్య దగ్గర వేడినే భరించలేం..అలాంటిది ఓ యువకుడు ఏకంగా లావా దగ్గరకు పోయాడు. వేడిగా పైగి ఎగిసి పడి.. మండుతున్న ద్రవానికి అత్యంత సమీపంగా వెళ్లి ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఈ వీడియాను ఈ నెల 24 న ‘ఓడ్ లీ టెర్రిఫైయింగ్’ యూజర్ నేమ్ తో ట్వీట్ చేయగా ప్రస్తుతం వైరల్గా మారింది. అయితే ఆ యువకుడు ఎవరు..? అక్కడకు ఎందుకు వెళ్లాడు. అన్న విషయాలు వెల్లడి కాలేదు. సముద్ర తీరంలో కొండరాళ్లపైకి ఎగిసిపడే నీళ్లలాగా పైకి ఉబుకుతున్న లావా దగ్గరకు వెళ్లేటప్పుడు యువకుడు కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. వేడిని తట్టుకునే విధంగా దుస్తులు కూడా వేసుకోలేదు. కేవలం ఒక టీషర్ట్, ఫ్యాంటు, నెత్తిన టోపీ వేసుకుని దర్జాగా వెళ్లిపోయాడు. దీనినై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అంత వేడిగా ఉండే లావా దగ్గరకు ఎవరూ వెళ్లలేరని..అది ఫేక్ వీడియో అని కొట్టి పారేస్తుంటే..మరికొందరు బుర్ర లేని పని తిట్టిపోస్తున్నారు.
భూమి వంటి కొన్ని గ్రహాల గర్భం నుండి బయటికి విడుదలైనా శిలాద్రవాన్ని లావా అంటారు. గ్రహగర్భంలో ఉండే వేడి వల్ల శిలాద్రవం (మాగ్మా) ఏర్పడుతుంది. గ్రహ గర్భంలో ఉండే రాతి ద్రవం అగ్నిపర్వత ముఖద్వారాల లేదా ఉపరితలంపై ఉన్ని చీలికల ద్వారా బయటకు వస్తుంది. ఈ సమయంలో విపరీతమైన వేడిని కలిగి ఉంటుంది. అప్పుడు దాని ఉష్ణోగ్రత 700 నుండి 1200 డిగ్రీ సెంటీగ్రేడ్ల వరకు ఉండవచ్చు. ఈ లావాయే చల్లబడి శిలలుగా రూపాంతరం చెందుతుంది.
What it looks like at the edge of a lava ocean 😳 pic.twitter.com/XeMhIrLolx
— OddIy Terrifying (@OTerrifying) December 24, 2022