చంపకండి.. లొంగిపోతానంటూ చేతులెత్తిన ఉగ్రవాది (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

చంపకండి.. లొంగిపోతానంటూ చేతులెత్తిన ఉగ్రవాది (వీడియో)

October 17, 2020

vngvnfgn

తప్పుదారిలో ఉగ్రవాదంలో చేరి అక్కడ ఉండలేక లొంగిపోయాడు ఓ వ్యక్తి. ఆర్మీ సిబ్బంది వద్దకు వచ్చి తాను మారిపోయానని,చంపకండి అంటూ రెండు చేతులు పైకి ఎత్తి వేడుకున్నాడు. వెంటనే అతన్ని తల్లిదండ్రుల వద్దకు జాగ్రత్తగా చేర్చారు. జమ్మూ కశ్మీర్‌లోని చదుర ప్రాంతంలో జరిగింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను భారత సైన్యం విడుదల చేసింది. ఓ కరుడు గట్టిన ఉగ్రవాది లొంగిపోవడం ఇదే మొదటిసారి అని భద్రతా బలగాలు చెబుతున్నాయి. అతడి వద్ద నుంచి ఏకే 47 గన్ స్వాధీనం చేసుకున్నారు. 

జహంగీర్ భట్ అనే యువకుడు చాలా కాలం క్రితం ఉగ్రవాదానికి ఆకర్షితుడు అయ్యాడు. గన్ పట్టుకోవాలనే కోరికతో అందులో చేరి శిక్షణ తీసుకున్నాడు. కొడుకు చాలా కాలంగా కనిపించకపోవడంతో తల్లిదండ్రులు గాలించినా ఆచూకీ దొరకలేదు. అయితే ఈనెల 13న ఉగ్రవాది సంచరిస్తున్నాడనే సమాచారంతో భద్రతా బలగాలు అతన్ని చుట్టుముట్టాయి. ఈ విషయాన్ని అతడి తండ్రికి సమాచారం అందించారు. లొంగిపోవాలని, ఎవరూ చంపరని తండ్రి సూచించాడు. ఆయన హామీతో నమ్మకం కుదిరింది. చెట్ల పొదల నుంచి బయటకు వస్తూ అతడు రెండు చేతులు పైకి ఎత్తాడు. తాను మారిపోయానని చంపవద్దని వేడుకున్నాడు. ఫైరింగ్ చేయకుండా వదిలేశారు. మరోసారి ఉగ్రవాదం వైపు వెళ్లకూడదని సూచించారు.