160 స్పీడ్‌తో కారు నడిపిన కుక్క.. పోలీసుల ఎంట్రీ  - MicTv.in - Telugu News
mictv telugu

160 స్పీడ్‌తో కారు నడిపిన కుక్క.. పోలీసుల ఎంట్రీ 

March 31, 2020

Man Teach Driving To Pitbull  

అమెరికాలో ఓ వ్యక్తి తన కుక్కడ్రైవర్‌తో హడలెత్తించాడు.తన పెంపుడు కుక్కతో డ్రైవింగ్ చేయిస్తూ తాను మాత్రం దర్జాగా ప్యాసింజర్ సీట్లో కూర్చొని తెగ ఎంజాయ్ చేశాడు. 51 ఏళ్ల ఆల్బర్ట్‌ టిట్లో అనే  వ్యక్తి చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వింత ఘటన సీటెల్‌లో ఇటీవల చోటు చేసుకుంది.

ఆల్బర్ట్‌ టిట్లో తన కారులో రోడ్డుపైకి వచ్చాడు. ఆ సమయంలో అతడు కారు డ్రైవింగ్ చేయకుండా తన కుక్కతో డ్రైవింగ్ చేయించాడు. అంతేకాకుండా ఏకంగా 160 కిలోమీటర్ల వేగంగా దాన్ని నడిపించడు. ఈ విషయం స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అన్ని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆల్బర్ట్‌ను పోలీసులు ప్రశ్నించగా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తన కుక్కకు డ్రైవింగ్‌ నేర్పిస్తున్నానని చెప్పు కొచ్చాడు. ఈ విషయం విన్న పోలీసు అధికారి హెథర్‌ ఆక్స్ట్‌మాన్‌ షాక్ అయ్యారు. ఇలాంటి వాళ్లను  క్షమించకూడదని భావించి కేసు నమోదు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకొని కుక్కను షెల్టర్‌లో నిర్భందించారు.