తన భార్యే అనుకొని మరొకరి భార్యను హత్య - MicTv.in - Telugu News
mictv telugu

తన భార్యే అనుకొని మరొకరి భార్యను హత్య

May 22, 2022

తన భార్య అనుకొని మరో మహిళను కత్తితో దారుణంగా హత్య చేశాడో వ్యక్తి. తమిళనాడులోని తిరుపత్తూర్ జిల్లా అంటూర్ లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. తిరువణ్ణామలై జిల్లా ఇందిరానగర్‌ పరిధికి చెందిన దేవేంద్రన్‌కు మొదటి భార్య చనిపోవడంతో ధనలక్ష్మిని అనే మహిళను ఐదు నెలల క్రితం రెండో పెళ్లి చేసుకొన్నాడు. వీరి మధ్య గొడవలు రావడంతొ ధనలక్ష్మి ఆంబూరులోని పుట్టింటికి వెళ్లింది. ఇక ఆంబూర్‌ కంబికొల్లై పరిధికి చెందిన జాన్ బాషా అనే వ్యక్తి చోరీ కేసులో అరెస్ట్ జైలు పాలు కావడంతో అతని భార్య గౌసర్ , పిల్లలు..దిక్కులేని వారయ్యారు. వారు భిక్షాటన చేస్తూ రాత్రిసమయాల్లో ఆంబూర్‌ రైల్వే స్టేషను ఎదురుగా ఉన్న నేతాజీ రోడ్డులో పాదరక్షలు విక్రయించే దుకాణాలు ముందు నిద్రిస్తుంటారు. ధనలక్ష్మి కూడా రాత్రి సమయాల్లో ఆ దుకాణాల ఎదుట నిద్రిస్తున్నట్లు దేవేంద్రన్‌కు సమాచారం అందటంతో శుక్రవారం రాత్రి అక్కడికి వచ్చాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆంబూరు వచ్చిన దేవేంద్రన్‌ చీకట్లో ధనలక్ష్మి అనుకొని గౌసర్‌ను కత్తితో గొంతుపై, ఛాతీభాగంలో పొడిచాడు. ఈ ఘటనలో గౌసర్‌ తీవ్రంగా గాయపడింది. ఆమె కేకలు వేయడంతో పక్కనే ఉన్న ధనలక్ష్మికి కత్తి పోటు పడటంతో ఆమె నిద్ర లేచింది. స్థానికులు దేవేంద్రన్‌కు దేహశుద్ధి చేసి ఆంబూర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చేసరికి గౌసర్‌ చనిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆంబూర్‌ ఆసుపత్రికి తరలించారు. ధనలక్ష్మిని వేలూర్‌ అడుకంపారై ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.