పెళ్లి వేడుకలో ఓ వ్యక్తి కరెన్సీ నోట్లను గాల్లో ఎగరేస్తూ సందడి చేసుకున్నారు. హైదరాబాద్లోని పాతబస్తీలో ఈ చోద్యం జరిగింది. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ ఫౌంటెన్ పైకి ఎక్కి ఆ వ్యక్తి కరెన్సీ నోట్లను గాల్లోకి ఎగురవేశారు. ఈనెల 9 వ తేదిన రాత్రి వేళ జరిగిన ఓ పెళ్లి ఊరేగింపులో భాగంగా ఆ వ్యక్తి ఇలా ప్రవర్తించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీసులు ఆరా తీసి.. వీడియోలో ఎగురవేసిన నోట్లను రూ.20గా గుర్తించారు. ఈ సంఘటనపై చార్మినార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.