బ్రిడ్జికి ఉరేసుకుని దూకాడు.. పోలీసులొచ్చి (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

బ్రిడ్జికి ఉరేసుకుని దూకాడు.. పోలీసులొచ్చి (వీడియో)

December 3, 2019

bridge

మహారాష్ట్రలో ఓ 43 ఏళ్ల వ్యక్తి బహిరంగంగా ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బ్రిడ్జికి తాడు కట్టి, మెడలో తాడు వేసుకుని కిందికి దూకడం స్థానికంగా కలకలం రేపింది. థానేలోని కాల్వా ప్రాంతంలోని నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జికి తాడుకట్టి మెడలో తాడు వేసుకుని బ్రిడ్జిపై నుంచి దూకేశాడు. మెడకు తాడు బిగించుకోవడంతో విలవిల్లాడాడు. అది చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. 

అందుబాటులో థానే పోలీసులు ఉండటంతో మంచిదైంది. వెంటనే వారు చురుగ్గా స్పందించారు. హుటాహుటిన క్రేన్ తీసుకువచ్చి దాని సహాయంతో అతన్ని కాపాడారు. స్థానికుల సహాయంతో సురక్షితంగా కిందకు దించి దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ప్రస్తుతం అతనికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అతనికి ప్రాణాపాయం లేదు అని వైద్యులు వెల్లడించారు. కాగా, నడిరోడ్డు మీద ఉరి వేసుకుని చనిపోయేందుకు ప్రయత్నించిన వ్యక్తి పేరు భగవాన్‌ కాంబ్లే అని, మద్యం మత్తులో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. కొడుకు చనిపోయినప్పటి నుంచి అతని మానసిక పరిస్థితి సరిగా లేదని సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.