man trying to do fire stunt and gets boomerang
mictv telugu

నిప్పుతో నేషనల్ గేమ్ ఆడి మూతి కాల్చుకున్నాడు.. వీడియో వైరల్

November 2, 2022

ఈ వీడియో చూస్తే అతడు సినిమాలో త్రివిక్రమ్ రాసిన డైలాగ్ గుర్తుకొస్తుంది. నిప్పుతో చెలగాటమాడకూడదని అందరికీ తెలుసు.. కానీ, కొందరు దాన్ని పరీక్షించాలనుకుని భంగపడుతుంటారు. ముఖ్యంగా ఏమైనా ఊరేగింపులు జరిగేటప్పుడు కానీ, షో వంటివి జరిగేటప్పుడు కానీ మంటలతో స్టంట్స్ చేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి.

సినిమాల్లోని పబ్ సాంగ్స్‌లో చూపించినట్టు నిజ జీవితంలో అనుకరిస్తే ప్రమాదం తప్పదు. ఇలాంటి రిస్క్ చేసిన ఓ వ్యక్తి ప్రమాదంలో పడ్డాడు. ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి ప్రేక్షకుల ముందు ఓ టేబుల్ మీద నిలబడి మండుతున్న కర్రను పట్టుకున్నాడు. నోట్లో పెట్రోల్ పోసుకొని అచ్చం సినిమాల్లో చూపించినట్టు పెట్రోల్ బయటికి ఉమ్ముతూ మంటను మరింత పెంచుతున్నాడు. అయితే ఇక్కడే సీన్ రివర్స్ అయింది. బయట మండుతున్న మంట కాస్తా నోటి వరకు వచ్చి మూతి, గడ్డం మొత్తం కాలిపోయాయి. వెంటనే అప్రమత్తమైన ఇద్దరు వ్యక్తులు వచ్చి మంటలార్పడానికి ప్రయత్నించారు. ఇలా జరిగిన ఈ ఘటన వీడియో నెట్టింట షికార్లు చేస్తూ ఇలాంటివి అనుకరించవద్దని హెచ్చరిస్తోంది.