గూగుల్‌కు కుచ్చుటోపీ.. ట్రాఫిక్ లోపాన్ని ఇలా ఎండగట్టాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

గూగుల్‌కు కుచ్చుటోపీ.. ట్రాఫిక్ లోపాన్ని ఇలా ఎండగట్టాడు..

February 3, 2020

Google Maps.

కొందరు తమకు వచ్చిన విద్యను మంచికి కాకుండా చెడుకు వినియోగిస్తుంటారు. దీంతో వారు ఎంతోమందికి చేటు చేయడమే కాదు, చివరికి వారు కూడా కటకటాల వెనకకు వెళ్లాల్సి వస్తుంది. టెక్నాలజీని బురిడీ కొట్టించి తప్పించుకు తిరగొచ్చు అనుకున్నాడు. గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుని ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్లాలన్నా సులువుగా వెళ్లిపోతున్నాం. దీనిపై ఓ వ్యక్తికి దురాలోచన వచ్చింది. 90 నకిలీ స్మార్ట్ ఫోన్లతో నకిలీ ట్రాఫిక్ జామ్‌లను సృష్టించాడు. జర్మనీ రాజధాని బెర్లిన్‌కు చెందిన సైమన్ వెకర్ట్ అనే ఆర్టిస్టు గూగుల్ మ్యాప్స్‌కు గురిపెట్టాడు.

ఇంతకీ అతను ఏం చేశాడంటే.. 99 స్మార్ట్ ఫోన్లలో లొకేషన్ ఆన్ చేసి వాటిని ఓ చిన్న బండిలో వేసుకుని, దానిని తోసుకుంటూ బెర్లిన్ నగరంలో తిరిగాడు. గూగుల్ కార్యాలయం ఉన్న వీధి సహా అన్నీ వీధుల్లో తిరిగాడు. అతను అలా తిరగడంతో ఇతరుల ఫోన్లలో గూగుల్ మ్యాప్స్‌లో ఆయా రూట్లలో ట్రాఫిక్ జామ్ అయినట్టు వారికి రెడ్ సిగ్నల్ చూపించసాగింది. కానీ, ఆ రోడ్లు నిర్మానుష్యంగా, ఏమాత్రం ట్రాఫిక్ లేకుండా ఉన్నాయి. ఇదేదో ఘనకార్యం చేసినట్టు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అతడు. స్మార్ట్ ఫోన్లలో ఉండే లొకేషన్ మోడ్ సాయంతో కార్లు, ఇతర వాహనాలు గురించి గూగుల్ సమాచారాన్ని సేకరిస్తుంది. వాహనాలు వేగం, సంఖ్య చూపిస్తుంది. ఒకవేళ ఎక్కువ ఫోన్లలో లొకేషన్ ఆన్‌లో ఉంటే ఆ ప్రదేశాన్ని ఎరుపు రంగులో చూపించి ట్రాఫిక్ జాం అయినట్టు సూచిస్తుంది. దీంతో ప్రయాణికులు ఆ దారి నుంచి వెళ్లకుండా వేరే దారిన వెళ్తారు అని తెలిపాడు. అయితే అతను చేసిన పనిపై నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ ప్రయోగం నిజమైతే గూగుల్‌లో లోపాలను సరిచూడాల్సి వస్తుందని అన్నారు.