నిప్పు పెడుతుండగా లేచి కూర్చున్న శవం..! - MicTv.in - Telugu News
mictv telugu

నిప్పు పెడుతుండగా లేచి కూర్చున్న శవం..!

October 14, 2019

Man  .

ఓ వ్యక్తి చావు చివరి వరకు వెళ్లి బతికి వచ్చాడు. చనిపోయాడని అనుకొని అంత్యక్రియలు చేసి చివరికి నిప్పు పెట్టే సమయంలో లేచి కూర్చున్నాడు. ఒడిశాలోని గంజాం జిల్లా లావుఖాలో గ్రామంలో ఈ వింత ఘటన జరిగింది. శవం పైకి లేవడంతో అంతా ఒక్కసారిగా అదిరిపోయారు. తర్వాత బతికి వచ్చాడని తెలిసి సంతోషంగా ఇంటికి తీసుకెళ్లారు. 

మల్లిక్‌ (52) కొన్ని రోజులుగా జర్వంతో బాధపడుతున్నాడు. ఇటీవల జ్వరంతోనే అతడు మేకలను మేపేందుకు అడవికి వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా అడవిలో పడిపోయి కనిపించాడు. అతడు చనిపోయాడని భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. చితికి నిప్పు పెట్టే సమయంలో ఓ వ్యక్తి అతను  ఊపిరి పీలుస్తున్నట్లు గుర్తించారు. వెంటనే చితి నుంచి బయటకు తీసి కొద్దిసేపు అతని కాళ్లు చేతులు నిమిరారు. వెంటనే అక్కడే లేచి కూర్చున్నారు. ఈ విషయాన్ని ఆ చుట్టు పక్కల గ్రామాల్లో వింతగా చర్చించుకుంటున్నారు.