వరుణ దేవుని కరుణ కోసం ఇద్దరు మొగోళ్ల లగ్గం..! - MicTv.in - Telugu News
mictv telugu

వరుణ దేవుని కరుణ కోసం ఇద్దరు మొగోళ్ల లగ్గం..!

August 5, 2017

వర్షాలు పడాలని కప్పలకు పెండ్లి జేసుడు జూశ్నం,ఆఖర్కి కుక్కలకు పెండ్లి జేశుడు గుడ జూశ్నం కనీ మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ కాడ ఓ గమ్మతి పెండ్లి జర్గింది,వరుణ దేవుడి అనుగ్రహం కోసం ఇద్దరు మొగోళ్లు పెండ్లిజేస్కున్నరు. ఈ పెండ్లి వేడుకకు పెద్ద ఎత్తున తరలివచ్చిన జనం ఈమగ జంటను ఆశీర్వదించి,జోరుగ సంగీత్ వెట్టి డ్యాన్సులు గుడ జేశిన్రట. ఈ పెళ్లిలో ఆ మొగోళ్లిద్దరినీ పెండ్లికుమార్తెలుగా, వరుణదేవుడిని(ఇంద్రుణ్ని) పెండ్లి కుమారుడిగా భావిస్తరట. ఇంకా గమ్మతి ముచ్చటేందంటే ఆళ్ళిద్దరికి  ఇదివర్కే పెండ్లై పిల్లలు గుడ ఉన్నరట,ఆళ్ళే దగ్గరుండి ఆళ్లను తయారుజేశి మరీ ఈ పెండ్లి జేశిన్రట.వర్షాలు పడక రైతుల గోస సూడలేక వరుణుదేవుడు కరుణించాలని గిట్ల పెళ్లిజేస్కున్నరన్నట్టు. ఇగ పెండ్లైనంక  ఇద్దరు గుడ ఎవ్వల బార్యాబిడ్డల్ను వాళ్లు తీస్కొన ఎవలింటికి వాళ్లు పోయిన్రట.కనీ ఎవ్వలేమనుకున్న పట్టిచ్చుకోకుంటా ఓ మంచిపనికోసం గిట్ల పెండ్లిజేస్కున్న  వాళ్లిద్దరిని మస్తు మెచ్చుకుంటున్రట గ ఊరోళ్లంత.