భార్య మంగళసూత్రం కోసం ఇంత పని చేశాడు - MicTv.in - Telugu News
mictv telugu

భార్య మంగళసూత్రం కోసం ఇంత పని చేశాడు

October 25, 2019

బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్‌ హోస్ట్‌గా చేస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రోగ్రామ్‌కు ఉన్న ఆధరణ అందరికీ తెలిసిందే. ఈ షోకు ఎంతో మంది కంటెస్టెంట్లు వస్తూనే ఉంటారు. అలా వచ్చిన వారు గెలుచుకున్నప్రైజ్ మనీ ఏం చేస్తారంటూ అమితాబ్ అడగటం.. వారు దానికి సమాధానం చెప్పడం కామన్. కానీ గురువారం ప్రసారమైన ప్రోగ్రామ్‌లో బిహార్‌కు చెందిన కుమార్ రంజన్ ఇచ్చిన సమాధానం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అమితాబ్ కూడా కొంతసేపు షాక్‌లో ఉండిపోయాడు.

ఇంతకీ కుమార్ రంజన్ ఈ షోకు రావడానికి కారణం ఏంటంటే తన భార్యకు బంగారు మంగళసూత్రం కోసం. దాన్ని ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చేందుకు కేబిసీకి వచ్చినట్టు తెలిపాడు.  కొన్ని రోజుల క్రితం కుమార్ రంజన్ ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో వాళ్ల సపోర్టు లేకపోవడంతో వాళ్లకు దూరంగా ఉంటూ జీవిస్తున్నాడు. పెళ్లి అయినా కూడా తన భార్యకు బంగారు మంగళసూత్రం కూడా లేకపోవడంతో ఎలాగైనా తనకు గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాడు. అయితే తాను చేసే ఉద్యోగంతో మంగళసూత్రం కొనడం కష్టమని భావించి అందుకే ఈ షోలో పాల్గొన్నట్టు తెలిపాడు. ఇది విన్నాక అమితాబ్‌తో పాటు అక్కడున్నవారు కూడా షాకయ్యారు. కాాగా ఇటీవల అమితాబ్ రెగ్యులర్ చెకప్‌లో భాగంగా మూడు  రోజుల పాటు చికిత్స అనంతరం ఆయన తిరిగి కేబీసీ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.