ఏటీఎంకు వెళ్లి డబ్బులు డ్రా చేస్తుండగా రూ.500 డ్రా చేస్తే రూ.2500 వచ్చాయి. ఎన్నిసార్లు చేసినా డబ్బులు వస్తూనే ఉన్నాయి. ఈ విషయం తెలిసి ఆ ఏటీఎం వద్ద జనాలు బారులు తీరారు. హైదరాబాద్‌లోని మొఘల్‌పురా పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి శాలిబండకు చెందిన ఓ వ్యక్తి హరిబౌలి చౌరస్తాలోని HDFC బ్యాంక్ ఏటీఏంకి వెళ్లి రూ.500 డ్రా చేసేందుకు యత్నించగా మిషన్ నుంచి రూ.2500 బయటకు వచ్చాయి. అప్పటికే ఎంతమంది అలా డ్రా చేశారో తెలియదు కానీ.. ఆ వ్యక్తి మాత్రం వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు
విషయం తెలుసుకున్నఇన్స్పెక్టర్ శివ కుమార్ వెంటనే ఏటీఎం వద్దకు చేరుకున్నారు. అప్పటికే విషయం తెలుసుకున్న చాలా మంది స్థానికులు అక్కడికి ఎగబడ్డారు. ఇన్స్పెక్టర్ ఏటీఎంలో లోపలకు వెళ్లి చెక్ చేశారు. రూ.500 విత్ డ్రా చేస్తే రూ.2500 వచ్చాయి. దీంతో వెంటనే బ్యాంక్ అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఏటీఎం కేంద్రాన్ని మూసి వేయించి.. అక్కడ ఉన్న జనాలను పంపించారు. టెక్నికల్ సమస్యల కారణంగానే ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు.