చేతిపై పురుషాంగం.. నడుం కింద అతికించడానికి రెడీ! - MicTv.in - Telugu News
mictv telugu

చేతిపై పురుషాంగం.. నడుం కింద అతికించడానికి రెడీ!

August 3, 2020

Man who lost penis to blood infection has new one built on his arm.

మన వైద్య రంగానికి సాధ్యం కానిదంటూ ఏదీలేదు. మన శరీరంలో కోల్పోయిన అవయవాన్ని కూడా వైద్యులు తమ నైపుణ్యంతో దాని స్థానంలో కొత్త అవయవాన్ని కూడా సృష్టిస్తున్నారు. ఓ వ్యక్తి అంతుచిక్కని వ్యాధితో తన పురుషాంగాన్ని కోల్పోయాడు. దీంతో అతను చాలా కృంగిపోయాడు. ఓ వైద్యుడు అతని పరిస్థితిని అర్థం చేసుకుని పురుషాంగాన్ని అతని ఎడమ చేతిపై సృష్టించాడు. ఇందుకోసం బాగానే ఖర్చు అయింది. త్వరలోనే చేతిపై ఉన్న అంగాన్ని అది ఉండే చోటును అమర్చనున్నారు. బ్రిటన్‌లో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. 45 ఏళ్ల  మాల్కమ్‌ డొనాల్డ్‌ పెరీనియం (మల ద్వారానికి, పురుషాంగానికి మధ్య ఉండే ప్రదేశం) భాగంలో ఇన్ఫెక్షన్‌ కారణంగా చాలాకాలం బాధపడ్డాడు. ఆ ఇన్ఫెక్షన్ కాస్తా సెప్సిసకు దారితీసి కాలి, చేతుల వేళ్లు, పురుషాంగం నల్లగా అయిపోయాయి. 2014లో పురుషాంగం ఊడి పడిపోయింది. వృషణాలు మాత్రం అలాగే ఉన్నాయి. దీంతో తీవ్ర ఆందోళన చెందిన మాల్కమ్ ఆసుపత్రికి వెళ్లాడు.  మిగిలిన భాగాన్ని చుట్టలా చుట్టడం తప్ప ఏమీ చేయలేమని వైద్యులు చెప్పారు. 

దీంతో మాల్కమ్ మరింత కుంగుబాటుకు లోనయ్యాడు. ఈ క్రమంలో కుటుంబ వైద్యుడు డేవిడ్‌ రాల్ఫ్‌ అనే ప్రొఫెసర్‌ గురించి మాల్కమ్‌కు తెలిసింది. లండన్‌ యూనివర్సిటీ కాలేజ్‌ ఆసుపత్రిలో పురుషాంగ మార్పిడి నిపుణుడు అయిన డేవిడ్‌ రాల్ఫ్‌కు ‘పెనిస్‌ మాస్టర్‌’గా పేరుంది. పురుషాంగం లేకుండా పుట్టిన ఆండ్రూ వార్డెల్‌ అనే వ్యక్తికి బయోనిక్‌ పురుషాంగాన్ని అమర్చి ఘనత సాధించారు. ఆలస్యం చేయకుండా మాల్కమ్‌ వెళ్లి ఆయనను కలిశారు. మాల్కమ్ నమ్మకాన్ని వమ్ము చేయలేదాయన. అతడి చేతిపై అంగాన్ని మొలిపించవచ్చని భరోసా ఇచ్చాడు. ఇందుకోసం కనీసం నాలుగేళ్లు పడుతుందని, 50 వేల పౌండ్లు (దాదాపు రూ.50 లక్షలు) ఖర్చు అవుతుందని తెలిపాడు. మాల్కమ్ అదృష్టం ఏంటంటే.. అంగం అమర్చడం వల్ల అతడికి మూత్రవిసర్జన సులువవుతుందని.. చికిత్సకు అయ్యే వ్యయాన్ని భరించేందుకు సర్కారు అంగీకరించింది. దీంతో, నాలుగేళ్ల క్రితం చికిత్స మొదలైంది. వైద్యులు అతడి అంగానికి సంబంధించిన రక్త నాళాలు, నాడులను ఉపయోగించి కొత్త అంగం మొలిపించే ప్రక్రియను ప్రారంభించారు. ఎడమ చేతి మీది చర్మాన్ని సేకరించి దాన్ని చుట్టి మూత్రమార్గాన్ని ఏర్పాటు చేశారు. చేతిపై పూర్తిగా పెరిగిన పురుషాంగాన్ని దాని సహజ స్థానంలోకి అమర్చే ఆపరేషన్‌ కోసం మాల్కమ్‌ ప్రస్తుతం ఎదురు చూస్తున్నాడు.  కరోనా కారణంగా చికిత్స సాధ్యం కావట్లేదు. ఈ ఏడాది చివరికైనా సరే ఆ ఆపరేషన్‌ పూర్తవుతుందని ఆశిస్తున్నాడు. ఇదిలావుండగా.. చేతిమీద వేలాడే పురుషాంగాన్ని కప్పి ఉంచేందుకు అతడు   పొడుగు చేతుల చొక్కాలే ధరిస్తున్నాడు. అయినా కొందరు దాన్ని గమనించి ఆశ్చర్యపోతారని మాల్కమ్‌ తెలిపాడు. ‘డాక్టర్లు అనుకున్నదానికన్నా రెండు అంగుళాలు ఎక్కువ పొడుగ్గా ఏర్పాటు చేయాలని నేను కోరాను. అందుకు వారు సరే అన్నారు. అందుకే.. నాలాంటి డిజైనర్‌ పురుషాంగం ఎవరికీ ఉండదు. ఈ పురుషాంగానికి ‘జిమ్మీ’ అని పేరు కూడా పెట్టుకున్నాను’ అని మాల్కమ్‌ తెలిపాడు.