గొడవల కోసం ఆవును చంపాడు.. దొరికిపోయాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

గొడవల కోసం ఆవును చంపాడు.. దొరికిపోయాడు..

June 13, 2019

Man with Rs 25,000 reward arrested by the Delhi police for slaughtering cow to incite communal distubance

ఆవును చంపి, మతఘర్షణలు రేకెత్తించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది హోళీ పండుగ రోజు ఇమ్రాన్ అనే వ్యక్తి ఓ గోవును వధించి, మాంస భాగాలను ఢిల్లీలోని హర్ష్ విహార్ ప్రాంతంలో చెల్లాచెదురుగా పడేసి మతఘర్షణలు సృష్టించేందుకు  ప్రయత్నించాడు. అది గమనించిన స్థానికులు ఆందోళనకు దిగారు. ఆవును చంపిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

అప్రమత్తమైన పోలీసులు మతఘర్షణలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇరువర్గాల పెద్దలను పిలిపించి, మాట్లాడటంతో వివాదం సద్దుమణిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పర్వేజ్, లుక్‌మన్, ఇన్సాల్లామ్ లను అదుపులోకి తీసుకున్నారు. ఇమ్రాన్ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు అనేక చోట్లలో తలదాచుకున్నాడు. పోలీసులు అతనిపై రూ.25వేల రివార్డు కూడా ప్రకటించారు. ఎట్టకేలకు ఇమ్రాన్ బుధవారం పోలీసులకు దొరికాడు.

పోలీసుల విచారణలో ఇమ్రాన్ ‘నా కుటుంబం గోవుల కొనుగోలు, విక్రయం వ్యాపారం ఉంది. నేను గోవును చంపి దాని భాగాలను వీధిలో చెల్లా చెదురుగా పడేశాను. అలా చేస్తే మత ఘర్షణలు చోటు చేసుకుంటాయి’ అని వెల్లడించాడు.