కేంద్రప్రభుత్వ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ మేనేజ్ మెంట్ (MANAGE)లో కాంట్రాక్టు బేసిస్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల్లో మేనేజర్ ఇన్నేవేషన్ మేనేజ్ మెంట్, కంటెంట్ డెవలపర్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు సంబంధితకోర్సులో నైపుణ్యం ఎంటెక్, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఎ, ఎంఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత పనిలో కూడా అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయస్సు తప్పనిసరిగా 50ఏళ్లకు మించకూడదు.
ఈ అర్హతులున్న అభ్యర్థులు మార్చి 4,2023వ తేదీలోపు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్వ్యూ, విద్యార్హత ఆధారంగా ఈ పోస్టులకు సెలక్ట్ చేస్తారు. నెలకు జీతభత్యం రూ. 50వేల నుంచి 1.50లక్షల వరకు చెల్లిస్తారు. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్లో పొందుపరిచిన నోటిఫికేషన్ను చెక్ చేసుకోండి.