Management seat scam: ED searches NRI, Akkineni women's hospitals in Andhra Pradesh
mictv telugu

ఆస్పత్రులపై ఈడీ దాడులు..అదుపులో ’అక్కినేని‘ మణి

December 2, 2022

ఏపీలో ఈడీ దాడులు కలకలం రేపాయి. గత కొంత కాలంగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన గుంటూరు జిల్లా ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో ఈడీ దాడులు చేపట్టింది. ఢిల్లీ నుంచి వచ్చిన నాలుగు ప్రత్యేక బృందాలు ఆస్పత్రిలో రికార్డుల్ని పరిశీలిస్తున్నాయి. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని ఆరా తీస్తున్నాయి. విజయవాడలోని అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ సీఎండీ మణి టార్గెట్‌గా అధికారుల సోదాలు చేపట్టారు. ఎన్ఆర్ఐ ఆస్పత్రి నిధుల నుంచి అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రికి పరికరాలు కొన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ దృష్టి సారించింది. ఈ మేరకు విజయవాడ అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రిలోనూ సోదాలు చేస్తోంది. అక్కినేని మణిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విదేశీ పెట్టుబడులు, నిధుల మళ్లింపుపై ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈడీ అధికారులు ఆసుపత్రి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆసుపత్రిలోకి ఎవరినీ రానివ్వకుండా ఈడీ అధికారులు సీఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరించారు. విజయవాడలో అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ గత ఆగస్టులోనే ప్రారంభమైంది.