manager cheats producer with name of anushka shetty
mictv telugu

అనుష్క పేరుతో.. 50లక్షల భారీ మోసం..!

January 25, 2023

సామాన్య జనాల్లో సినీ స్టార్స్ పై ఉండే క్రేజ్ ని క్యాచ్ చేసుకోవడానికి ఒక బ్యాచ్ సిద్ధంగా ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్స్ ని ఎర చూపి భారీ మోసాలు చేస్తుంటారు కేటుగాళ్లు. అయితే ఇలాంటి వారినుండి రక్షించాల్సిన సెలబ్రెటీల వ్యక్తిగత సిబ్బందే మోసానికి పాల్పడితే ఎవ్వడు ఏం చేయలేడు. తాజాగా అలాంటి సంఘటన ఒకటి ఇండస్ట్రీలో జరిగింది. మోసపోయింది కూడా సామాన్యుడు కాదు. ఒక యువ నిర్మాత. స్వీటీ అలియాస్ అనుష్క శెట్టి పేరు చెప్పి ఏకంగా 50లక్షలకు ఆ నిర్మాతకి కుచ్చు టోపీ పెట్టాడు మేనేజర్ లక్ష్మణ్ చారి. సినీ నటి అనుష్క అపాయింట్ మెంట్ కావాలంటే యాభై లక్షలు ఇవ్వాలంటూ ఆ మేనేజర్ నిర్మాతకు గాలమేసి మోసం చేసిన ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అనుష్క డేట్స్ కోసం ఎంతోమంది నిర్మాతలు క్యూలో ఉంటారు. అయితే ఆచితూచి సినిమాలను ఎంచుకుంటున్న అనుష్కని రీచ్ అవ్వటం కాస్త కష్తమే ఇప్పుడు. ఈ నేపథ్యంలో సదురు నిర్మతని నమ్మించి ఈజీగా మేనేజర్ మోసం చేసేశాడు.

అయితే ఇలాంటి మోసాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న రష్మిక మందన్న పేరుతో ఇలాంటి మోసాలే జరిగాయి. ఈ నేపథ్యంలో అనుష్క పేరుతో అప్ కమింగ్ ప్రొడ్యూసర్ లక్ష్మన్ చారీని మోసం చేశాడు మేనేజర్ ఎల్లారెడ్డి. అనుష్కని కలిపిస్తానంటూ విశ్వకర్మ క్రియేషన్స్ అధినేత, నిర్మాత లక్ష్మన్ చారీ నుండి 51 లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇక అనుష్కతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ డేట్స్ కూడా ఇప్పిస్తామంటూ నిర్మాతను మోసం చేశాడట. చివరకు తాను మోసపోయానని తెలుసుకున్న నిర్మాత బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. తనను పలు మార్లు బెంగళూర్ తీసుకెళ్లాడని, అక్కడ మోతి మహల్ హోటల్‌లో పలువురిని పరిచయం చేశాడట. చివరకు తాను ఎల్లారెడ్డి చేతిలో మోసపోయానంటూ సదరు నిర్మాత తెలుసుకోవడంతో ఇలా న్యాయం కోసం పోలీసుల వద్దకు చేరుకున్నాడు నిర్మాత లక్ష్మన్ చారీ.