Manager clarity on Samantha's health..
mictv telugu

సమంత ఆస్పత్రిలో చేరిందా ?

November 24, 2022

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే సమస్యతో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని ఆమెనే స్వతహాగా సోషల్ మీడియాలో ప్రకటించారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్యంపై రకరకాల వార్తలు వస్తున్నాయి. తాజా మరోసారి ఇలాంటి పుకార్లే షికార్లు చేశాయి. సమంత ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని సోషల్ మీడియాతో పాటు తమిళ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. ఆమె ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని విపరీతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను సమంత మేనేజర్ కూడా కొట్టిపారేశాడు. ఆమె ఇంటి వద్దనే క్షేమంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. దయచేసి అవాస్తవాలను ప్రచారం చేయొద్దని కోరారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద చిత్రం నవంబర్‌ 11న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం కోసం సెలైన్‌ పెట్టుకుని మరీ యశోద సినిమాకు డబ్బింగ్‌ చెప్పింది. శరీరం సహకరించలేకపోయినా తనవంతు సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : సీనియర్ నటుడు చనిపోయాడని వార్తలు..ఖండించిన ఫ్యామిలీ