అయ్యో కాంగ్రెస్.. టీఆర్ఎస్‌లోకి మరొకరు జంప్ - MicTv.in - Telugu News
mictv telugu

అయ్యో కాంగ్రెస్.. టీఆర్ఎస్‌లోకి మరొకరు జంప్

March 17, 2019

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రోజుకో షాక్ తగులుతోంది. రోజుకో ఎమ్మెల్యే పార్టీ మారుతున్నామని ప్రకటిస్తుండటంతో టీకాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి గులాబీ కండువా కప్పుకున్నారు.

Manakondur Ex Mla Arepally Mohan Join into Trs Party.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ మైదానంలో సాయంత్రం 6 గంటలకు ఈ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను ఆకర్షించేందుకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. రెండు రోజుల ముందునుంచే స్థానిక నేతలతో చర్చించిన మోహన్.. ఆదివారం కేటీఆర్‌తో సమావేశమై పార్టీలో చేరుతానని ప్రకటించారు.

దీంతో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సీనియర్ నేత పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ఆరేపల్లి మోహన్ 2009లో మానకొండూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేతిలో ఓటమి పాలయ్యారు.