మంచు ఫ్యామిలీ క్షమాపణ చెప్పాల్సిందే : నాయీ బ్రాహ్మణుల డిమాండ్ - MicTv.in - Telugu News
mictv telugu

మంచు ఫ్యామిలీ క్షమాపణ చెప్పాల్సిందే : నాయీ బ్రాహ్మణుల డిమాండ్

March 2, 2022

mj

పదేళ్లకు పైగా మంచు మోహన్ బాబు కుటుంబం వద్ద పనిచేసిన హెయిర్ స్టైలిస్ట్ నాగరాజు చేసిన ఆరోపణలు ఆ ఫ్యామిలీకి కొత్త ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. తనను చిత్ర హింసలకు గురి చేయడంతో పాటు కులం పేరుతో దూషించారనీ, కావాలనే తనపై దొంగతనం కేసు పెట్టి మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ నాగరాజు ఇటీవల ఓ వీడియో చేయడం తెలిసిందే. ఆ వీడియోను నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు ఇటీవల చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ మాట్లాడుతూ.. మంచు మోహన్ బాబు కుటుంబం బేషరతుగా క్షమాపణలు చెప్పాలనీ, లేదంటే భారీ ఎత్తున ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. కాగా, ఇంత జరుగుతున్నాకూడా మోహన్ బాబు కుటుంబంలో ఎవ్వరూ స్పందించకపోవడం గమనార్హం.