మంచు ఫ్యామిలీ అంటేనే అందరికి గుర్తుచ్చేది ట్రోల్స్. ఈ కుటుంబంలో ట్రోలర్స్ ఎవ్వరిని వదలరు. దాంతో సినిమా ప్రమోషన్స్ తప్పిస్తే ఈ మధ్య ఇంటర్వ్యూస్ తగ్గించేసింది మంచు ఫ్యామిలీ. మోహన్ బాబు నుండి మొదలుపెడితే.. మంచు విష్ణు, మంచు లక్ష్మి, మంచు మనోజ్ ఇలా అందరిని ఒక ఆట ఆడేసుకుంటారు నెటిజన్స్. అయితే తమపై మెగా బ్యాచ్ కావాలని ట్రోల్స్ చేయిస్తుందని బుకాయించినా.. వారి అతి మాటలు చేష్టలే ట్రోల్స్ కి రీజన్ అని అంటారు. దీంతో టంగ్ కాస్త కంట్రోల్ లో పెట్టుకుంటున్నారు మంచు బ్రదర్స్. అయితే ఈ బ్రదర్స్ బయట బాగానే ఉన్నా.. ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయని పుకార్లు వస్తున్నాయి. ఒకరంటే ఒకరికి పడదని.. అందుకే మంచు మనోజ్ ఇంటి నుండి వెళ్లిపోయాడని అంటారు. విష్ణు, మనోజ్ మధ్య దేనికి విభేదాలు వచ్చాయో ఎవరికీ తెలియదు. విష్ణు అమ్మానాన్నలతో ఉంటే.. మనోజ్ మాత్రం విడిగా ఉంటున్నాడు.
అయితే మొన్న విడాకుల తరువాత.. భూమా అఖిలప్రియతో బాహాటంగా బయట కనిపిస్తున్న మనోజ్ పై రూమర్స్ ఎక్కువయ్యాయి. అఖిల ప్రియతో పెళ్ళికి మంచు ఫ్యామిలీ నిరాకరిస్తున్నారని.. దీంతో బ్రదర్స్ మధ్య మరింత విభేదాలు వచ్చాయని కొత్తగా ప్రచారం జరుగుతుంది. దీనిపై తాజాగా మంచు లక్ష్మి స్పందించింది. ఫ్యామిలీలో బ్రదర్స్ కి, తమకు మధ్య విభేదాలు ఉన్నాయని పుకార్లపై మంచు లక్ష్మి స్పందిస్తూ.. “మా ఫ్యామిలీకి సంబందించిన విషయాలన్నీ మా పర్సనల్. ఎందుకంటే.. మేమెప్పుడూ కలిసే ఉన్నాం. కాకపోతే ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. విష్ణుకి ఫ్యామిలీ, పిల్లలు, బిజినెస్ వాటికే టైమ్ సరిపోతుంది.. ఇక ఎక్కువగా నేను, మనోజ్ ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తాం. అందుకే ఎక్కడైనా మేమిద్దరమే ఎక్కువగా కనిపిస్తాం” అని చెప్పింది. అయితే మరోవైపు లక్ష్మి మాటలు విని మంచు ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయనే వార్తలకు బలం చేకూరినట్లు అయ్యిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.