Manchu Lakshmi adopted 50 schools in Yadadri district
mictv telugu

యాదాద్రి జిల్లాలో 50 పాఠశాలలను దత్తత తీసుకున్న మంచు లక్ష్మి

July 22, 2022

Manchu Lakshmi adopted 50 schools in Yadadri district

తన ఇంగ్లీషు భాష, యాసతో యూట్యూబ్‌లో ట్రోలింగ్‌కు గురయ్యే మంచు లక్ష్మి.. తనలో ఉన్న మంచి వ్యక్తిని కూడా సమాజ సేవ ద్వారా అప్పుడప్పుడు వెల్లడిస్తుంది. ఇప్పుడు మరో మంచి పనికి సహాయం చేయడానికి సిద్ధమైంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగం అయింది. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంటానని ప్రకటించింది. తన టెక్ ఫర్ చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో 1 నుంచి 5 వరకు స్మార్ట్ క్లాసులు, పాఠ్యపుస్తకాలు, మౌలిక వసతులు కల్పిస్తానని హామీ ఇచ్చింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన మంచు లక్ష్మిని కలెక్టర్ అభినందించారు.