manchu lakshmi bold charector in monster movie
mictv telugu

ఘాటైన సీన్స్.. క్రేజీ లిప్ లాక్స్

December 6, 2022

 

సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఎన్ని వచ్చినా.. మంచు ఫ్యామిలీలో అందరికి కంటెంట్ ఉందన్నది మాత్రం వాస్తవం. మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ వీరిలో అందరు మంచి పర్ఫార్మర్లే. సరైన పాత్ర పడితే అదరగొట్టడం ఖాయం. ఒక్కటంటే ఒక్క హిట్ వస్తే చాలు తిరిగి ట్రాక్ ఎక్కేసే సత్తా ఉన్నోళ్లే. కానీ వీళ్ళ విధి ఏంటో కానీ ఇప్పటివరకు వరుసగా విఫలం అవుతూనే వస్తున్నారు. కథల ఎంపిక సరిగ్గా లేకపోవటమే వీరి ఫెయిల్యూర్స్ కి కారణమంటారు. కానీ మంచు లక్ష్మి మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా తన ట్యాలెంట్ ని షో చేస్తూనే ఉంటుంది. టీవీషోస్, ఓటీటీ కంటెంట్, అవార్డు ఫంక్షన్స్, హోస్టింగ్, యాక్టింగ్ ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకుంది మంచు లక్ష్మి. కేవలం పెద్దింటి అమ్మాయి అన్నది ఒక్కటి మాత్రమే ఈమె పూర్తి ట్యాలెంట్ చుపెట్టుకోవడానికి అడ్డు అంటారు. దీనికి తోడు వీరిపై సోషల్ మీడియాలో ఉండే నెగిటివిటి. అయితే తాజాగా తనలోని నట దాహాన్ని మంచు లక్ష్మి తీర్చుకుంది. అది కూడా ఒక మలయాళం చిత్రంతో. మల్లూవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో ఢీ అంటే ఢీ అనే సన్నివేశాల్లో అద్భుతంగా నటించింది మంచు లక్ష్మి.

తాజాగా మోహన్ లాల్ హీరోగా మలయాళంలో సూపర్ హిట్ కొట్టిన ‘మాన్‌స్టర్’ మూవీలో సంచలన పాత్ర చేసింది మంచు లక్ష్మి. అదే హోమో సెక్సువల్ రోల్. తనకున్న స్టేటస్ కి తెలుగులో ఇలాంటి పాత్రలు చేయకున్నా.. పరభాషలో మాత్రం మొహమాటం లేకుండా రెచ్చిపోయింది మంచు లక్ష్మి. సహచర హీరోయిన్ తో ఘాటైన సీన్స్ లోను ప్రొఫెషనలిజం చూపెట్టింది మంచు వారమ్మాయి. ‘మాన్‌స్టర్’ మూవీలో దుర్గ అనే పనిమనిషి క్యారెక్టర్ చేసిన మంచు లక్ష్మి స్క్రీన్ స్పేస్ తక్కువే ఉన్నప్పటికీ.. ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేసింది.
2011లో హరియాణాలో ఇద్దరమ్మాయిలు పెళ్లి చేసుకుంటే.. ఈ హోమో సెక్సువల్ అమ్మాయిలని ప్రజలు కొట్టి పంపించేస్తారు. ఆ తర్వాత వాళ్లు ఏం చేశారనే దాన్ని బేస్ చేసుకుని ‘మాన్‌స్టర్’ స్టోరీ రాసుకున్నారు. ఈ సినిమాలో హోమో సెక్సువల్స్ భామిని పాత్ర హనీ రోజ్ చేయగా, దుర్గ అనే క్యారెక్టర్ ని మంచు లక్ష్మీ పోషించారు. ఈ జోడీ మధ్య లిప్ లాక్ సీన్స్ కూడా ఉన్నాయి. ఇందులో హనీరోజ్, మంచు లక్ష్మీలు ఘాటైన సన్నివేశాల్లో చాలా అద్భుతంగా నటించారు. ఇలాంటి రోల్స్ చేయాలంటే చాలా డేర్ ఉండాలి. దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్న మంచు లక్ష్మీ.. నటిగా మరో మెట్టు ఎక్కేసింది. అలానే ఈ సినిమాలోనే హీరో మోహన్ లాల్ తో ఫైట్ చేసి విలనిజం కూడా చూపించింది. స్క్రీన్ స్పేస్ తక్కువైనప్పటికీ.. మంచు లక్ష్మీ క్యారెక్టర్ గురించి ప్రేక్షకులు మాట్లాడుకోవడం గ్యారంటీ.