నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన కొత్త సినిమా వీర సింహారెడ్డి. సంక్రంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. పవర్ ఫుల్ కథతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది తొలి రోజే సాలీడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. విడుదలైన అన్ని సెంటర్లలో ఈ సినిమాకు బ్రహ్మరథం పలుకుతున్నారు ఆడియన్స్. విడుదలకు ముందు వదిలిన సినిమా టీజర్, ట్రైలర్, అప్ డేట్స్ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి.
బాలకృష్ణ కెరీర్ లోనే ఎక్కువ థియేటర్లలో విడుదలైన సినిమాల్లో ఒకటిగా వీర సింహారెడ్డి నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 875 పైగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మరో 90 థియేటర్లు, ఓవర్సీస్ లో 500 పైగా థియేటర్లలో రిలీజయ్యింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మొత్తం 1465 చోట్ల వీర సింహారెడ్డి బొమ్మ పడింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ బాలయ్య అభిమానులు హంగామా చేశారు. ఏకంగా అమెరికాలో కొబ్బరి కాయలు కొడుతూ, థియేటర్లలో పేపర్లు చింపుతూ సందడి చేస్తారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలతో సోషల్ మీడియాలో సందడి వాతావరణం నెలకొంది.
ఇక ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు థియేట్సర్స్ లో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఇక ఈ సినిమాలోని మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి పాటకు చాలా మంది స్టెప్పులేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ పాటకు మంచు లక్ష్మీ కూడా డాన్స్ చేశారు. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. మంచు లక్ష్మీ.. బాలకృష్ణ సినిమా ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా లో నటించిన సంగతి తెలిసిందే.