సోదరుడు మంచు మనోజ్ తో విభేదాలు ఉన్నట్టు వస్తున్న వార్తలపై మంచు లక్ష్మి స్పందించారు. తమ కుటుంబాలకు చెందిన విషయాలను ప్రైవేటుగానే ఉంచుతామని స్పష్టం చేశారు. అయితే తనకు ఇద్దరు సోదరులతోనూ ఎలాంటి విభేదాలు లేవని తేల్చిపారేశారు. సమయం వచ్చినప్పుడు మాత్రమే తామంతా ఒక్కటిగా కనిపిస్తామని వెల్లడించారు. మంచు విష్ణు ఎక్కువగా కుటుంబం, పిల్లలు, వర్క్ మీదనే ఫోకస్ చేస్తాడు కాబట్టి తాము తరచూ కలవడం కుదరడం లేదని చెప్పారు. సోషల్ మీడియాలో తనపై జరిగే ట్రోల్స్ ని పట్టించుకోనని కొట్టిపారేశారు. ‘భూమ్మీద మనిషిగా పుట్టడం ఒక వరం. చాలా గొప్ప విషయం. అందుకని ఏదైనా గొప్పగా చేయాలనుకుంటున్నాను. నా ఆలోచనలకు అనుగుణంగానే నటిగా విభిన్న పాత్రలు చేస్తున్నాను’ అంటూ అభిప్రాయపడ్డారు. కాగా, అంతకుముందు మనోజ్, లక్ష్మిల మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయని పుకార్లు వచ్చాయి.