కేటీఆర్ కు మంచు లక్ష్మి బహిరంగ లేఖ - MicTv.in - Telugu News
mictv telugu

కేటీఆర్ కు మంచు లక్ష్మి బహిరంగ లేఖ

August 26, 2017

వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ లో రోడ్లను తవ్వి, వైర్లను కత్తిరించడం వంటవాటిపై సినీనటి మంచు లక్ష్మి రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ కు లేఖాస్త్రం సంధించారు. ‘‘ మండపాలను నిర్మించడానికి రోడ్లను తవ్వుతున్నారు.  ఫిల్మ్‌ నగర్‌ రోడ్డు నంబరు 1లో ఆ దృశ్యాన్ని చూశాను. చాలా ఎత్తయిన గణపతి విగ్రహాలను తరలించడానికి అడ్డంగా ఉన్న కేబుల్‌ వైర్లను కత్తిరిచి పడేశారు.

వీటిని తిరిగి బాగుచేసే బాధ్యత ఎవరు తీసుకుంటారు?  ఓ సాధారణ పౌరురాలిగా ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని అనుకుంటున్నా.. ’’ అని లేఖలో పేర్కొన్నారు.  జనం ఈ వినాయక చవితిని ఓ పర్వదినంలా కాకుండా ఆర్భాటాలకు పోటీగా భావిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎదుటి వారికన్నా గొప్పగా జరపాలనే ఆలోచనతో మౌలిక సదుపాయాలను పాడు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

‘ఒక ప్రాంతంలో ఒకే మండపం ఉండేలా చూడాలి. అలాచేస్తే ఆ ఏరియా ప్రజల్లో సమైక్యత పెరుగుతుంది. అందరూ కలసి పండగ చేసుకుంటారు. ’’ అని ఆమె సూచించారు.  హైదరాబాద్‌ అభివృద్ధిలో ముందంజలో ఉందని, ఈ నగరాన్ని అందంగా ఉంచాలని ఆమె ట్విటర్ లో కోరారు.  ఫిల్మ్‌నగర్‌లో రోడ్డును తవ్వి, కర్రలు కడుతున్న ఫొటోను కూడా ఆమె పోస్ట్‌ చేశారు.