మంచు మనోజ్‌ కారుకు జరిమానా.. ఎంతంటే? - MicTv.in - Telugu News
mictv telugu

మంచు మనోజ్‌ కారుకు జరిమానా.. ఎంతంటే?

March 30, 2022

mmmm

తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు గతకొన్ని రోజులుగా ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనాలపై జరిమానా విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం టాలీవుడ్‌ యంగ్‌ హీరో మంచు మనోజ్‌ కారుకు ​​​​ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధించారు. హైదరాబాద్‌‌లోని టోలీచౌకిలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మంచు మనోజ్‌ కారుకు బ్లాక్‌ ఫిలిం ఉన్నట్లు గుర్తించారు. దీంతో మనోజ్ కారుకు రూ. 700 ఫైన్‌ వేశారు. అంతేకాకుండా కారు అద్దాలకు ఉన్న బ్లాక్‌ ఫిలిం తెరను తొలగించారు.

మరోపక్క ఇటీవలే జూనియర్‌ ఎన్టీఆర్‌ కారును పోలీసులు తనిఖీలు చేసిన విషయం విధితమే. అయితే, ఎన్టీఆర్ కారుకు బ్లాక్‌ ఫిలిం తెర ఉన్నందున మోటారు వాహనాల చట్టం నిబంధనల ఉల్లంఘన కింద రూ. 700 జరిమానా విధించారు. అనంతరం ఆయన కారుకున్న బ్లాక్‌ ఫిలిం తెరను తొలగించారు. అలాగే, ఐకానిక్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, కల్యాణ్ రామ్‌ కారులకు సైతం బ్లాక్‌ ఫిలిం తెరను తొలగించి చలానా విధించారు. ఈ క్రమంలో బుధవారం మంచు మనోజ్ కారుకు కూడా జరిమానా విధించడం సంచలనంగా మారింది.