మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దివంగత భూమా నాగిరెడ్డి-శోభా నాగిరెడ్డి కుమార్తె మౌనిక రెడ్డిని ప్రేమించి పెళ్లాడారు. మార్చి 3వ తేదీన ఇరు కుటుంబాల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇరువురి కుటుంబసభ్యులు.. సినీ ప్రముఖుల మధ్య వీరి మ్యారెజ్ ఘనంగా జరిగింది. సినీ , రాజకీయ ప్రముఖులు వీరి పెళ్లికి హాజరై నూతన వధువరులను ఆశీర్వాదించారు. పెళ్లి అనంతరం కొత్త జంట ముందుగా కర్నూల్‌కు వెళ్లనుంది. తాజాగా మనోజ్ తన సతీమణి మౌనిక రెడ్డితో కలిసి అత్తారింటికి బయలుదేరిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Newly wedded couple @HeroManoj1 & #BhumaMounika Started from Hyderabad to Kurnool. ❤️ ✨ #ManojManchu #MMWeds pic.twitter.com/9UwXeTmBkE
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) March 5, 2023
తన సోదరి మంచు లక్ష్మి ఇంటి నుంచి నేరుగా మనోజ్, మౌనికలు కర్నూలుకు పయనమయ్యారు. భారీ బందోబస్తు మధ్య రోడ్డు మొత్తం కార్లు.. కాన్వాయ్‌లతో వీరి ప్రయాణం సాగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది. మొదట వీరు పొద్దుటూరు వెళ్లి అనంతరం ఆళ్లగడ్డ ప్రాంతంలోని మౌనిక తల్లిదండ్రుల సమాధులను దర్శించుకుని ఆశీర్వాదం తీసుకోనున్నారని సమాచారం.
రెండు మూడు రోజుల్లోనే ఈ కొత్త జంట హనీమూన్ ట్రిప్ ప్రారంభం కానుందనే విషయం బయటకొచ్చింది. ముందుగా విదేశాల్లోని సుందరమైన రొమాంటిక్ ప్లేసెస్ చుట్టి వచ్చి ఆ తర్వాత ఇండియాలో కూడా ఎంజాయ్ చేసేలా ప్రణాళిక రచించుకున్నారట. మాల్దీవులు వెళ్లి అక్కడే ఓ వారం రోజులు స్టే చేయబోతున్నారు. ప్రపంచంలో ఉన్న పలు పర్యాటక, అందమైన సుందర ప్రదేశాలన్నీ చూసివచ్చేలా లాంగ్ షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్నారు.