మంచు వారబ్బాయి మనోజ్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయింది. గత కొన్నాళ్లుగా ఆయన పెళ్లి విషయం వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. అందుకు ముఖ్య కారణం ఆయన కొన్నాళ్లుగా ప్రముఖ పొలిటీషియన్, దివంగత నాయకుడు భూమా నాగిరెడ్డి కుమార్తె మౌనికతో రిలేషన్ షిప్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఆ వార్తలు బలం చేకూరేలా వాళ్లిద్దరూ గత ఏడాది సెప్టెంబర్ తొలి వారంలో భాగ్య నగరంలోని సీతాఫల్ మండిలోని వినాయక మండపంలో జంటగా కనిపించారు. ఆ సమయంలో గణనాథుడికి పూజలు చేశారు. అప్పుడే ప్రేమ విషయం బయటకు వచ్చింది. అప్పుడు పెళ్లి గురించి ప్రశ్నించగా… అది తన వ్యక్తిగత విషయం అని చెప్పారు.
ఆ తర్వాత డిసెంబర్ నెలలో కడప దర్గాను మనోజ్ సందర్శించారు. అక్కడ కొత్త జీవితం ప్రారంభించనున్నట్టు, త్వరలో కొత్త కుటుంబంతో కడప దర్గాకు మళ్ళీ రావాలని ఉన్నట్టు ఆయన తెలిపారు. అప్పుడు వీరిద్దరు పెళ్లి చేసుకుంటారనే స్పష్టత వచ్చింది. అయితే మరో వారంలోనే మంచు మనోజ్, మౌనికల వివాహం జరగనుందట. డేట్ కూడా ఖరారైందని ఫిల్మ్ వర్గాలు అంటున్నాయి. మార్చి తొలి వారంలో అంటే వచ్చే నెల 3 న వీరి వివాహం జరుగనుంది.అయితే దీనిపై ఇటు మంచు ఫ్యామిలీ, అటు భూమా ఫ్యామిలీ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.
కాగా, మంచు మనోజ్.. ప్రణతి రెడ్డి అనే యువతిని 2015లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఆ వివాహ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. తమ దారులు వేర్వేరు అంటూ 2019లో విడిపోయారు. తాజాగా రాయలసీమలో బలమైన రాజకీయ నేపథ్యం కల భూమా నాగి రెడ్డి, శోభా రెడ్డి దంపతుల రెండో కుమార్తె నాగ మౌనికను రెండో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు. ఆమెకు కూడా ఇది రెండో పెళ్లి.