టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ఇంట్లో పెళ్లి సందడి షురూ అయ్యింది. మోహన్ బాబు రెండో కుమారుడు , హీరో మంచు మనోజ్ వివాహం రేపు జరగనుంది. దివంగత రాజకీయనేత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనికారెడ్డిని పెళ్లిచేసుకోబోతున్నాడు. వీరి వివాహం శుక్రవారం జరగనుంది. మంచు లక్ష్మీ నివాసంలో వివాహ వేడుక జరగనుంది. ఈ పెళ్లిని ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పట్లన్నీ పూర్తి చేశారు. బుధవారం మెహందీ ఫంక్షణ్ ఘనంగా జరిగింది.
నేడు సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.కాగా మనోజ్ , మౌనికారెడ్డిలకు ఇది రెండో వివాహం. వ్యక్తిగత కారణాలతో వీరిద్దరి తొలివైవాహిక జీవితాలు మధ్యలోనే బ్రేక్ అయ్యాయి. చాలా కాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. చివరకు వీరిద్దరూ మూడు మూళ్ల బంధంలో ఒకటికానున్నారు. వీరి కొత్త జీవితం సంతోషంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.