సాయి ధరమ్, మంచు మనోజ్ కుక్కలకు భమ్‌చిక్ భమ్‌భమ్ - MicTv.in - Telugu News
mictv telugu

సాయి ధరమ్, మంచు మనోజ్ కుక్కలకు భమ్‌చిక్ భమ్‌భమ్

June 29, 2020

nvbn

టాలీవుడ్ హీరోలు తమ పెంపుడు కుక్కల డేటింగ్‌ను సరదాగా సోషల్ మీడియాలో పంచుకుంటూ అందరిని నవ్వులో ముంచేశారు. కాబోయే వియ్యంకుడు అంటూ సాయిధరమ్ తేజ్‌ను ఉద్దేశించి మంచు మనోజ్ ట్వీట్ చేయడంతో ఇది వైరల్ అయింది. తనకు మంచి అల్లుడిని ఇచ్చినందుకు ఈ సందర్భంగా కూడా కృతజ్ఞతలు చెప్పాడు. 

మెగా హీరోలతో ఎప్పుడూ సరదాగా ఉండే మనోజ్ తాజాగా సాయి ధరమ్ తేజ్‌ను కలిశాడు. ఈ సందర్భంగా వారి పెంపుడు కుక్కలు టాంగో, జోయాలతో కలిసి వెళ్లారు. ఈ విషయాన్ని చెబుతూ.. ‘ఇది మా కుక్కలకు డేటింగ్ రోజు. నాకు మంచి అల్లుడిని ఇచ్చినందుకు నా వియ్యంకుడు సాయి ధరమ్ తేజ్‌కు థాంక్స్. త్వరలోనే ముహుర్తాలు పెట్టి శుభలేక పంపిస్తాం. భౌతిక దూరం పాటిస్తూనే దీన్ని ఏర్పాటు చేశాం’ అంటూ వారిద్దరు ఉన్న ఫొటోను షేర్ చేసి చమత్కారించాడు. దీంతో నెటిజన్లు సరదా కామెంట్లు పెడుతుండటం విశేషం.