మంచు మనోజ్ విడాకులు..బరువైన హృదయంతో - MicTv.in - Telugu News
mictv telugu

మంచు మనోజ్ విడాకులు..బరువైన హృదయంతో

October 17, 2019

Manchu Manoj confirms divorce

టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ దాదాపు రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 2017లో వచ్చిన ‘ఒక్కడు మిగిలాడు’ మంచు మనోజ్ చివరి సినిమా. కొన్ని రోజుల క్రితం మంచు మనోజ్ విడాకులు తీసుకున్నారని వార్తలు వచ్చాయి. వాటిని మనోజ్ ఖండించాడు. తాజాగా ఆయన విడాకులు తీసుకున్నాడని స్వయంగా ప్రకటించాడు. తన విడాకుల విషయాన్ని మనోజ్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశాడు. తమ విడాకుల ప్రక్రియ పూర్తయిన విషయాన్ని బరువైన హృదయంతో మీకు తెలియజేస్తున్నాను అంటూ ఓ ఎమోషనల్ లేఖను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

నాలుగేళ్ళ తమ పెళ్లి బంధానికి ముగింపు పలికామని.. తమ మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయన్నాడు. వాటి వల్ల చాలా నొప్పిని కూడా అనుభవించామని తెలియజేసాడు. ఎంతో వేదన తర్వాత ఇద్దరం విడిపోవడానికి నిశ్చయించుకున్నామని తెలిపాడు. విడిపోయినా కూడా ఇద్దరం ఒకరిని ఒకరం ఎప్పుడు గౌరవించుకుంటూనే ఉంటామని తెలిపాడు. తాము తీసుకున్న ఈ నిర్ణయాన్ని అంతా గౌరవిస్తారని.. అలాగే తమ వ్యక్తిగత జీవితానికి ప్రైవసీ ఇస్తారని ఆశిస్తున్నాము అంటూ లేఖ రాసాడు. ప్రణతి రెడ్డి.. మంచు మనోజ్ 20 మే 2015న వివాహ బంధంతో ఒక్కటయ్యారు.