Manchu Manoj is ready for his second marriage..the bride is her..
mictv telugu

రెండో పెళ్లికి సిద్దమైన మంచు మనోజ్..వధువు ఆమెనట..

September 5, 2022

టాలీవుడ్‌ యువ నటుడు మంచు మ‌నోజ్ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మంచు మ‌నోజ్..’మేజర్ చంద్రకాంత్’ సినిమాలో బాలనటుడిగా నటించి, ఆ తర్వాత ‘దొంగ దొంగది’ సినిమాతో ప్రేక్షకుల మదిలో ఎప్పటికి చేరిగిపోని ముద్రవేసుకున్నారు. మంచు మోహ‌న్ బాబు త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి త‌న న‌ట‌న‌తో, అభిన‌యంతో ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. విభిన్న జాన‌ర్‌లో సినిమాల‌ను చేస్తూ, ఫలితాలు ఎలా ఉన్న ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు.

తాజాగా మంచు విష్ణువుకి సంబంధించిన ఓ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. మ‌నోజ్ రెండో పెళ్ళికి సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తుంది. ప్ర‌ముఖ రాజ‌కీయ వేత్త, దివంగ‌త భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తే మౌనిక రెడ్డిని వివాహం చేసుకోబోతున్న‌ట్లు సమాచారం. వీరిద్ద‌రూ క‌లిసి సీతాఫ‌ల్ మండిలోని గ‌ణ‌ప‌తిని ద‌ర్శించి, పూజలు చేశారు. అనంతరం మ‌నోజ్‌ పెళ్ళి విష‌య‌మై మీడియా ప్ర‌తినిధులు పలు అడుగగా..దానికి మ‌నోజ్ న‌వ్వుతూ ‘పెళ్ళి అనేది నా వ్య‌క్తిగ‌త అంశ‌ం. స‌మ‌యం వ‌చ్చిన‌పుడు నేనే చెబుతా’అని అన్నాడు. దాంతో వీళ్ళ పెళ్ళి త్వ‌రలోనే జ‌రుగ‌నున్న‌ట్లు హింట్ ఇచ్చాడు. అయితే వీరిద్ద‌రికి గ‌తంలో వేర్వేరుగా పెళ్ళిళ్ళు అయ్యాయి.

మంచు మనోజ్.. 2015లో ప్ర‌ణ‌తిని వివాహం చేసుకోని, ప‌ర‌స్ప‌ర విభేదాలు రావ‌డంతో నాలుగేళ్ళ‌కు విడాకులు తీసుకున్నాడు. ఇక, మౌనిక రెడ్డి రెండేళ్ళ క్రీతం త‌న భ‌ర్త‌తో విడాకులు తీసుకుంది. అయితే, భూమా ఫ్యామిలీకి మంచు ఫ్యామిలీకి గ‌తం నుండి మంచి సాన్నిహిత్యం ఉంది. ఇక భూమా నాగిరెడ్డి దంప‌తులు మ‌ర‌ణించిన త‌ర్వాత మ‌నోజ్ ఆ ఫ్యామిలీ కీల‌క సంద‌ర్భాల్లో క‌నిపిస్తూ ఉండేవాడు. ఈ క్ర‌మంలోనే ఇద్ద‌రు ద‌గ్గ‌ర‌య్యార‌ని తెలుస్తుంది.