ఏపీ సీఎం జగన్‌ను కలిసిన మంచు మనోజ్‌ - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ సీఎం జగన్‌ను కలిసిన మంచు మనోజ్‌

September 6, 2021

ఏపీ సీఎం జగన్‌ను సినీ నటుడు మంచు మ‌నోజ్ మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా అభిమానుల‌తో షేర్ చేసుకున్న మ‌నోజ్.. సీఎం జగన్‌ను క‌ల‌వ‌డంపై సంతోషం వ్య‌క్తం చేశారు. రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఆశాజనకమైన ప్రణాళికలతో ముందుకెళుతున్నారని ప్రశంసలు కురిపించాడు మనోజ్.

రాబోయే రోజుల్లో ఏపీ అభివృద్ధి కోసం సీఎం జగన్ చేయాలనుకుంటున్న అభివృద్ధి పనులు, కార్యక్రమాల గురించి తెలిశాకా చాలా ముచ్చటేసిందని మంచు మనోజ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా ‘మీ ఆశయాలు నెరవేర్చే శక్తిని, ఆయురారోగ్యాలను ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను‘ అని మంచు మనోజ్ తెలిపారు.