‘అహం బ్రహ్మాస్మి’తో మంచు మనోజ్ రీఎంట్రీ - MicTv.in - Telugu News
mictv telugu

‘అహం బ్రహ్మాస్మి’తో మంచు మనోజ్ రీఎంట్రీ

February 13, 2020

Manchu manoj.

మంచు మనోజ్.. 2004లో వచ్చిన ‘దొంగ దొంగది’ సినిమాతో హీరోగా పరిచయమై ఎన్నో విభిన్న కథా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. అయితే 2017లో వచ్చిన ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా తరువాత మనోజ్ కొంతకాలంపాటు వెండితెరకు దూరంగా ఉన్నారు. 

ఇటీవల ఆయన ఎంఎం ఆర్ట్స్ పేరుతో కొత్త నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. తాజాగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో మనోజ్ ఓ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమాకు ‘అహం బ్రహ్మాస్మి’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాను నిర్మలాదేవి, మంచు మనోజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 6 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో నేడు సోషల్ మీడియా వేదికగా మంచు మనోజ్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నాడు. అహం బ్రహ్మాస్మి పోస్టర్ ను షేర్ చేసిన మంచు మనోజ్ ఓ ఎమోషనల్ ట్వీట్ పెట్టారు.