Manchu manoj will join TDP: Gone Prakash Rao
mictv telugu

టీడీపీలోకి మంచు మనోజ్.. అక్కడ నుంచి పోటీ చేసి చరిత్ర సృష్టిస్తాడు

September 19, 2022

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలోకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని బాంబు పేల్చారు. ఇప్పటికే మంచు మనోజ్ – మౌనిక రెడ్డిల ప్రేమాయణం గురించి చెప్పిన ప్రకాశ్ రావు.. ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీపై కామెంట్లు చేయడంతో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. తాజా ఇంటర్వ్యూలో ఆయన మోహన్ బాబు ఫ్యామిలీ పాలిటిక్స్ ఎంట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మోహన్ బాబు గారికి రాజకీయాల్లో ఇంట్రస్ట్ ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజ్యసభ ఇస్తారని ఆశించారు. కానీ అలా జరగలేదు. ఇప్పుడు మనోజ్ డైరెక్ట్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మోహన్ బాబుకి వయసైపోయింది కాబట్టి మనోజ్ పాలిటిక్స్‌లోకి రావచ్చు. మనోజ్ చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశముంది. 1978లో చంద్రబాబు గెలిచిన తర్వాత అక్కడ్నుంచి కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ తప్ప వేరే ఏ పార్టీ గెలవలేదు. వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి బలమైన నేత అక్కడున్నారు. ఆయనపై గెలవడమంటే మాటలు కాదు. కాబట్టి మనోజ్ అయితేనే కరెక్ట్ అని భావిస్తున్నారు’ అని వెల్లడించారు. అయితే పొటిటికల్ ఎంట్రీపై మంచు మనోజ్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.