Manchu Manojs Wedding With Bhuma Mounika Will Take Place On March 3
mictv telugu

మొదలైన మంచు మనోజ్ పెళ్లి సందడి… అక్క నివాసంలో వివాహం ?

February 27, 2023

Manchu Manojs Wedding With Bhuma Mounika Will Take Place On March 3

మంచు వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. మార్చి 3న మంచు మనోజ్- భూమా మౌనికల పెళ్లి అని తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించకపోయినా ఆ రోజే వీరిద్దరి వివాహం జరగనుందని సమాచారం. ఇప్పటికే పెళ్లి పనులు మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. మంచు మనోజ్ సోదరి మంచు లక్ష్మి నివాసంలో ఈ పెళ్లి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా మంచు లక్ష్మి నివాసంలో మహా మంత్ర యాగం జరిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ కార్యక్రమానికి మంచు ఫ్యామిలీకి చెందిన స్నేహితులు, సన్నిహితులు, ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. మంచు మనోజ్ పెళ్లి సందడిలోనే భాగం ఈ పూజ కార్యక్రమం జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో మంచు లక్ష్మి ఇంట్లోనే అది కొద్ది మంది బంధు, మిత్రుల సన్నిధిలో మంచు మనోజ్, భూమా మౌనిక ఒక్కటవ్వనున్నారని ప్రచారం సాగుతోంది.

గత ఏడాది మనోజ్-భూమా మౌనిక గణేష్ మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అప్పుడే వీరి పెళ్లిపై రూమర్స్ మొదలయ్యాయి. ఈ వార్తలపై సమయం వచ్చినప్పుడు అన్నీ విషయాలు చెబుతానని మనోజ్ కామెంట్ చేశారు. కొన్ని నెలలుగా మనోజ్-మౌనిక అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. ఈ క్రమంలో సహజీవనం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఫైనల్ గా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

మనోజ్ 2015లో ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్నారు. కానీ, విభేదాలు రావడంతో 2019లో ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.తర్వాత సినిమాల్లో కూడా మనోజ్ కనిపించలేదు. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల.. రెండవ కుమార్తె మౌనికకు కూడా ఇది రెండవ వివాహం. ఈమెకు గతంలో బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తితో పెళ్ళయ్యింది. 5 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు. కానీ మొదటి భర్తతో ఈమె విడాకులు తీసుకుంది.